Mohan Babu సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నిన్న జల్‌పల్లిలోని తన నివాసం వద్ద మీడియా వర్గాలపై దాడి చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. దాంతో ఈరోజు మోహన్ బాబు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసారు. తనకి పోలీసులు జారీ చేసిన నోటీసుని సవాలు చేసారు. తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తాను సెక్యూరిటీ కోరినా భద్రత కల్పించలేదని, వెంటనే తనకు భద్రత కల్పించాలని పిటిషన్ వేసారు. మోహన్ బాబు తరఫున సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీ మనోహర్ పిటిషన్ దాఖలు చేసారు. ప్రస్తుతం మోహన్ బాబు ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజులుగా మంచు ఇంట్లో ఆస్తుల వివాదం నడుస్తోంది. నాలుగు గోడల మధ్య జరగాల్సిన చర్చ కాస్తా రోడ్డు మీదకు వచ్చింది. దాంతో మీడియా వర్గాలన్నీ జల్‌పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్దే ఉన్నాయి. మోహన్ బాబుని చూసిన జర్నలిస్టులు ప్రశ్నలు వేస్తుంటే మైకు లాక్కుని దాడి చేసారు. ఇద్దరు ముగ్గురు జర్నలిస్టులకు గాయాలయ్యాయి. దాంతో ఆయనపై జర్నలిస్టుల సంఘం కేసు వేసింది.

Mohan Babu హైకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబు
More News
మోమోల కోసం బంగారం ఇచ్చేసాడు
Momos ఆ బాలుడికి మోమోలంటే చాలా ఇష్టం. మాటిమాటికీ స్కూల్ నుంచి వస్తూ ఓ బండి వద్ద ఆగి మోమోస్…
నాడు రంగా.. నేడు అంబటి
Vangaveeti Narendra వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబుపై దాడి చేయడం ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసి…
భారత్ ఆ దేశం నుంచే చమురు కొంటుంది
Donald Trump అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ చమురు దిగుమతులపై కీలక వ్యాఖ్యలు చేసారు. ఇక నుంచి భారత్…
నీ నుంచి సంస్కారం ఆశించడంలో అర్థం లేదు
Nara Rohit ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!




