2026 November Amavasya: ఈ నెల (నవంబర్ 2026) 20న అమావాస్య. ఈసారి ప్రత్యేక గ్రహ స్థితులతో అమావాస్య రావడంతో కొన్ని రాశులపై ప్రభావం మరింతగా కనిపించనుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. చంద్రుడి శక్తి తగ్గే ఈ అమావాస్య రోజున కొన్ని రాశుల వారికి భావోద్వేగాలు, నిర్ణయాలు, ఆర్థిక పరమైన విషయాల్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. ఈ అమావాస్య రోజున ఐదు రాశుల వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. వారు ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలో తెలుసుకుందాం.
మేష (Aries)
మేష రాశి వారికి ఈ అమావాస్య ఎక్కడ లేని చిరాకు, ఇతర మానసిక సమస్యలు తెచ్చిపెడుతుంది. కాబట్టి ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించండి. ఇంట్లో తగాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. డబ్బు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఎవరేమన్నా, ఏం జరిగినా మౌనం వహించండి.
మిథున (Gemini)
మిథున రాశి వారు ఈ అమావాస్య రోజున విపరీతంగా ఆలోచిస్తుంటారు. విభిన్న భావోద్వేగాలతో సతమతమవుతుంటారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఏదన్నా సమాచారం అందించేటప్పుడు జాగ్రత్త. ఓవర్ ప్రామిస్‌లు చేసేయకండి. ఎలాంటి కమిట్మెంట్స్ ఇవ్వకపోవడం బెటర్. ధ్యానం చేయండి.
సింహం (Leo)
ఈగో వల్ల గొడవలు తలెత్తే అవకాశం ఉంది. మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి. మీరు పని చేసే చోట రాజకీయాలు నడుస్తుంటాయి. వాటికి దూరంగా ఉండండి. రిలేషన్‌షిప్‌లో పొరపొచ్చాలుంటాయి. పట్టించుకోవద్దు. నిద్రలేమ సమస్యలు తలెత్తచ్చు.
వృశ్చిక (Scorpio)
చంద్రుడికి సంబంధించిన అంశాల్లో వృశ్చిక రాశి వారిపై సాధారణంగానే ప్రభావం ఉంటుంది. ఇక అమావాస్య రోజు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ఏదో తెలీని భయం, నమ్మకం కోల్పోవడం, ఉన్నట్టుండి ఏడుపు తన్నుకురావడం.. ఇవన్నీ ఉంటాయి.
మకర (Capricorn)
ఈ అమావాస్య సమయంలో మకర రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఏదైనా ఖర్చు చేసే ముందు, పెట్టుబడులు పెట్టే ముందు, ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు బాగా ఆలోచించండి. డాక్యుమెంట్ల విషయంలో మరింత శ్రద్ధ అవసరం. ఒకటికి పది సార్లు చదివి కన్ఫర్మ్ చేసుకోండి.





