Bangladesh: 11 మంది.. ఇప్పటివరకు బంగ్లాదేశ్ చంపిన హిందువుల సంఖ్య. అది కూడా 35 రోజుల్లో. ఇందుకు కారణం.. బంగ్లాదేశ్ నుంచి పారిపోయి ఢిల్లీలో తలదాచుకుంటున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను మనం బంగ్లాకు అప్పగించకపోవడమే.
బంగ్లాదేశ్‌కు చెందిన ఢాకా అంతర్జాతీయ క్రైమ్స్ ట్రిబ్యూనల్ హసీనాకు గతేడాది మరణశిక్ష విధించాలని తీర్పు వెలువడించడం సంచలనంగా మారింది. ఆమె బంగ్లాదేశ్ ప్రధానిగా ఉండగా మానవత్వానికి వ్యతిరేకంగా ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పలు కేసులు నమోదైన నేపథ్యంలో ట్రిబ్యూనల్ మరణశిక్ష ఖరారు చేసింది. తన హయాంలో తాను తీసుకునే నిర్ణయాలకు ఎవరు వ్యతిరేకంగా వ్యవహరించినా వారిని చంపేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో హసీనాను త్వరగా బంగ్లాదేశ్‌కు అప్పగించాలని ఆ దేశ ప్రభుత్వం భారత్‌కు నోటీసులు కూడా పంపింది. కానీ భారత్ మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు హసీనాను బంగ్లాకు అప్పగించలేమని చెప్పింది. దాంతో బంగ్లాదేశ్ భారత్‌పై గుర్రుమంది. ఈ నేపథ్యంలో బంగ్లా వాసులు హిందువులను దారుణంగా హింసించి చంపేస్తున్నారు. దీనిపై తాత్కాలిక బంగ్లా ప్రధానిగా వ్యవహరిస్తున్న మహ్మద్ యూనస్ నోరు మెదపకపోగా.. ఇవి కక్షపూరిత హత్యలు కావని.. ఏదేమైనప్పటికీ ఈ హత్యలు ఎందుకు చోటుచేసుకున్నాయో అంతర్గతంగా విచారణ చేపిస్తానని తెలిపారు. మరోపక్క అంతర్జాతీయ హిందూ సంస్థలు బంగ్లాదేశ్‌లో మైనార్టీల కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను నియమించాలని డిమాండ్ చేస్తున్నాయి.
2024 ఆగస్ట్‌లో షేక్ హసీనా తీసుకున్న నిర్ణయాల వల్ల అల్లర్లు చోటుచేసుకుని దాదాపు 1400 మంది చనిపోయారు. దాంతో బంగ్లా ప్రజలు హసీనా పాలనపై తిరగబడ్డారు. ఆమె కట్టుబట్టలతో వెంటనే అధికారిక విమానంలో తప్పించుకుని భారత్ రాజధాని ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. ఇప్పటివరకు కూడా ఆమె ఢిల్లీలోనే తలదాచుకున్నారు. ఈలోగా ట్రిబ్యూనల్ వాదోపవాదాలు విని ఆమెకు, బంగ్లాదేశ్ మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్‌కు మరణశిక్ష విధించింది. తీర్పుకు ముందు వరకు తనను అల్లా పుట్టించాడనే అల్లానే తన ప్రాణాలు తీసుకుంటాడని చెప్పిన హసీనా.. ఉన్నట్టుండి తనకు మరణశిక్ష పడిందని తెలీగానే ట్రిబ్యూనల్‌ను తప్పుబట్టారు.





