Dating కొంతమంది డేటింగ్‌కి వెళ్లి తొలి పరిచయంలోనే పార్ట్‌నర్‌ను తమ మ్యాజికల్ మాటలతో పడేస్తారు. ఇంకొందరుంటారు.. వీరికి నోరు తెరిచి మాట్లాడటంలోనే సమయమంతా అయిపోతుంది. అవతలివాళ్లు కూడా అలాగే ఇంట్రోవర్ట్‌గా ఉంటే ఇక అంతే సంగతులు. మరికొందరుంటారు..వీరికి మాట్లాడాలనే ఉంటుంది కానీ ఏం మాట్లాడాలో తెలీదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు ముందే ఏం మాట్లాడాలి.. ఎలాంటి విషయాలు అడగాలి అనేది ప్రిపేర్ అయ్యుండాలి. ఒకవేళ మీరు డేటింగ్‌కి వెళ్తున్నట్లైతే ఈ ప్రశ్నలు మైండ్‌లో పెట్టుకోండి. వీటి ద్వారా మీ సంభాషణ మరింత ముందుకెళ్తుంది. ఒకరి పట్ల ఒకరికి ఆసక్తి కలిగే అవకాశం ఉంటుంది.
మీ కంఫర్ట్ ఫుడ్ ఏంటి?
మీరు ఏది సంతోషాన్నిస్తుంది? నచ్చిన ప్రదేశానికి వెళ్లినప్పుడా లేదా నచ్చిన పని చేస్తున్నప్పుడా?
మీ ఇంట్లో పెట్స్ ఉన్నాయా? ఒకవేళ లేకపోతే దేన్ని పెంచుకోవాలనుంది?
సూర్యోదయం ఇష్టమా? సూర్యాస్తమయమా?
సర్‌ప్రైజ్‌లు ఇష్టమా? లేక అన్నీ ప్లాన్డ్‌గా ఉండేలా చూసుకుంటారా?
పాట వినగానే డ్యాన్స్ వేయాలనిపించే పాట ఏదైనా ఉందా?





