Search The Query
Search

Image
  • Home
  • Politics
  • Komatireddy Venkat Reddy పుష్ప వేస్ట్ సినిమా.. 3 గంట‌లు బొక్క‌

Komatireddy Venkat Reddy పుష్ప వేస్ట్ సినిమా.. 3 గంట‌లు బొక్క‌

Komatireddy Venkat Reddy పుష్ప వేస్ట్ సినిమా.. 3 గంట‌లు బొక్క‌ :

పుష్ప వేస్ట్ సినిమా : Komatireddy Venkat Reddy అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప 2 సినిమాను తెలంగాణ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట రెడ్డి ఈరోజు వీక్షించారు. సినిమా చూసిన త‌ర్వాత ఆయ‌న త‌న అభిప్రాయాల‌ను మీడియా ద్వారా పంచుకున్నారు. పుష్ప 2 (Pushpa 2) సినిమా చండాలంగా ఉంద‌ని త‌న మూడు గంట‌లు వేస్ట్ అయ్యాయ‌ని షాకింగ్ కామెంట్స్ చేసారు. ఆ త‌ర్వాత పుష్ప 2 రిలీజ్ స‌మ‌యంలో సంధ్య థియేట‌ర్ ద‌గ్గ‌ర జ‌రిగిన తొక్కిస‌లాట‌లో తీవ్రంగా గాయ‌ప‌డి చావు బ‌తుకుల మ‌ధ్య కొట్టుమిట్టాడుతున్న శ్రీతేజ్‌ను ప‌రామ‌ర్శించేందుకు హాస్పిట‌ల్‌కు వెళ్లారు. శ్రీతేజ్ తండ్రితో మాట్లాడి అన్ని వివ‌రాల‌ను తెలుసుకున్నారు. శ్రీతేజ్ ప‌రిస్థితి గురించి మాట్లాడుతూ ఆయ‌న భావోద్వేగానికి గుర‌య్యారు. బాలుడిని చూస్తే బాధతో పాటు భయమేస్తోందని ఎప్పుడు కోలుకుంటాడో తెలీదని అన్నారు. బాధితుడికి త‌న‌ సొంత ట్రస్ట్ తరుపున రూ. 25 లక్షల ఆర్థిక సాయం ప్ర‌క‌టిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. పుష్ప వేస్ట్ సినిమా.. 3 గంట‌లు బొక్క‌

ఇదిలా ఉండ‌గా.. ప్ర‌ముఖ నిర్మాత‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తండ్రి అల్లు అర‌వింద్ రాజ‌ధాని ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. అల్లు అర్జున్ (Allu Arjun) న‌టించిన పుష్ప 2 (Pushpa 2) రిలీజ్ స‌మ‌యంలో.. సంధ్యా థియేట‌ర్ (Sandhya Theatre) వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌లో ఓ మ‌హిళ మృత్యువాత ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఆమె కుమారుడు చావు బ‌తుకుల మ‌ధ్య హాస్పిట‌ల్‌లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ నేప‌థ్యంలో అల్లు అర్జున్‌పై కేసు న‌మోద‌వ్వ‌డం.. ఆయ‌న్ను అరెస్ట్ చేసి చంచల‌గూడ జైలుకు త‌ర‌లించ‌డం.. ఆ త‌ర్వాత కొన్ని గంట‌ల్లోనే బెయిల్ రావ‌డం జ‌రిగిపోయాయి. అయితే అల్లు అర్జున్‌కి కేవ‌లం నాలుగు వారాలు మాత్ర‌మే బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ రిమాండ్‌కి వెళ్లాల్సిందే.

అల్లు అర్జున్‌ని ఎలాగైనా కేసు నుంచి త‌ప్పించేందుకు అర‌వింద్ ఎన్నో పాట్లు ప‌డుతున్నారు. ఇదేదో చిన్న మ్యాట‌ర్ అయ్యుంటే అంత టెన్ష‌న్ ప‌డాల్సిన ప‌ని లేదు. కానీ ఇక్కడ ఓ మ‌హిళ ప్రాణం పోయింది. ఆమె కొడుకు ఇంకా కోమాలోనే ఉన్నాడు. ఆ కుటుంబానికి అల్లు అర్జున్ రూ.25 ల‌క్ష‌ల సాయం ప్ర‌క‌టించారు. అలాగ‌ని ఈ కేసుని వ‌దిలేయ‌లేరు క‌దా. పైగా ఆ చ‌నిపోయిన మ‌హిళ భ‌ర్త మీడియా ముందుకు వ‌చ్చి త‌న భార్య చావుకు కార‌ణం అల్లు అర్జునే అని చెప్తూ క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. దాంతో ఈ కేసు ఇంకా స్ట్రాంగ్‌గా మారింది. ఓ మ‌హిళ ప్రాణం పోయింది అన‌గానే ప‌రిహారం ఇచ్చేస్తారు కేసు క్లోజ్ అయిపోతుంది అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వ‌డం జాతీయ స్థాయిలో సంచ‌ల‌నంగా మారింది.

ఢిల్లీకి అర‌వింద్

Allu Arjun Father దాంతో అల్లు అరవింద్ ఢిల్లీకి వెళ్ల‌నున్నార‌ట‌. ఎందుకంటే.. ఈ కేసు విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కాస్త సీరియస్‌గా ఉన్నార‌న్న విష‌యం కూడా స్ప‌ష్టంగా తెలుస్తోంది. పుష్ప 2 స‌క్సెస్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మ‌ర్చిపోవ‌డం.. ఆ త‌ర్వాత గొంతు పాడైంద‌న్న సాకుతో నీళ్లు తాగ‌డం.. ఆ త‌ర్వాత పేరు తెచ్చుకుని రేవంత్ రెడ్డి గురించి ప్ర‌స్తావిస్తూ ఆయ‌నకు ధ‌న్య‌వాదాలు చెప్ప‌డం వైర‌ల్‌గా మారింది. తెలంగాణ‌లో పుష్ప 2 కు టికెట్ రేట్లు పెంచితే త‌న పేరునే మ‌ర్చిపోతాడా అన్న కోపంతో కావాల‌ని అల్లు అర్జున్‌ని శుక్ర‌వారం అరెస్ట్ చేయించార‌న్న టాక్ కూడా ఉంది. శుక్ర‌వారం అరెస్ట్ చేస్తే శ‌నివారం, ఆదివారాల్లో కోర్టుకి సెల‌వు కాబ‌ట్టి బెయిల్ కోసం వెళ్ల‌లేర‌ని ప్లాన్ వేసి మ‌రీ శుక్ర‌వారం అరెస్ట్ చేయించారు. కానీ అల్లు అర‌వింద్ వెంట‌నే నాంప‌ల్లి హైకోర్టులో లంచ్ మోష‌న్ పిటిష‌న్ వేయించి మ‌రీ రూ. 4 కోట్లు ఖ‌ర్చు చేసి బెయిల్ తెప్పించుకున్నారు. {పుష్ప వేస్ట్ సినిమా.. 3 గంట‌లు బొక్క‌}

వాదోప‌వాదాలు విన్న కోర్టు నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ అల్లు అర్జున్ రిమాండ్‌కి వెళ్లాల్సిందే. దాంతో ఈ కేసు విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కాస్త త‌గ్గితే బాగుంటుంద‌ని భావించిన అల్లు అర‌వింద్.. స్వ‌యంగా ఆయ‌న్ను క‌లిసి మాట్లాడ‌టం కంటే ఢిల్లీలో కాంగ్రెస్ పెద్ద‌ల‌తో మాట్లాడితే త‌న కొడుకు బ‌య‌ట‌ప‌డ‌తాడు అని భావిస్తున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఢిల్లీకి వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది.

More News

Nara Lokesh tweets about OG film
Nara Lokesh OG అంటే ఒరిజిన‌ల్ గాడ్
BySai KrishnaSep 24, 2025

Nara Lokesh ప‌వ‌ర్‌స్టార్, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన ఓజీ సినిమా రేపు రిలీజ్ అవుతున్న సంద‌ర్భంగా…

pawan-kalyan-is-suffering-from-viral-fever
Pawan Kalyan ప‌వ‌న్‌కు వైర‌ల్ ఫీవ‌ర్
BySai KrishnaSep 23, 2025

Pawan Kalyan ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారినపడ్డారు. పవన్ కళ్యాణ్‌ గత రెండు…

Bonda Uma praises pawan kalyan on x
Bonda Uma చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుంటే ఏం లాభం?
BySai KrishnaSep 20, 2025

Bonda Uma తెలుగు దేశం పార్టీ నేత‌, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే బోండా ఉమ ప‌రిస్థితి చేతులు కాలాక…

Jagan says chandrababu naidu should be ashamed of himself
Jagan “యాడైనా దూకి సావొచ్చు చంద్రబాబు నాయుడు”
BySai KrishnaSep 10, 2025

Jagan: రైతులందరికీ యూరియా అందుబాటులో ఉంటే.. వాళ్లు రోడ్డెక్కాల్సిన అవసరమేంటి చంద్రబాబూ? చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో, రాష్ట్ర వ్యవసాయ…

JOIN US

Get Newsletter

Subscribe our newsletter to get the best stories into your inbox!


Scroll to Top