YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పంచుల వర్షం కురిపించారు. మెడికల్ కాలేజీల ప్రైవెటీకరణకు విరుద్ధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో జగన్ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
తన చిన్నప్పుడు జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ప్రైవేటీకరణ అంశం బెడిసికొట్టడంతో ఆయన సిగ్గుతో రాజీనామా చేసారని.. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండి మళ్లీ అదే తప్పు చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ గ్రాఫ్ పడిపోతే.. అది కలెక్టర్ల తప్పు అంటున్నారని.. ఒరే బాబూ పడిపోయింది మీ పార్టీ గ్రాఫ్ నాయనా కలెక్టర్లది కాదు. అది నీకు తెలియడం లేదు అంటూ సెటైర్ వేసారు. ఓ సందర్భంగా పోలీస్ సంస్థ ప్రభుత్వంలో ఎందుకు అన్నట్లు కూడా చంద్రబాబు మాట్లాడారని.. అది విని తన బుర్ర బద్ధలైపోయిందంటూ జగన్ పంచులు వేసారు.





