Money Remedies మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే మనీ వస్తాయనుకునేవాళ్లం. మనీ ప్లాంట్ పెట్టుకుంటే డబ్బు రాదు కానీ ఈ మొక్క పెట్టుకుంటే మాత్రం ఆర్థికంగా పుంజుకుంటారని కేరళకు చెందిన ఓ జ్యోతిష్యుడు చెప్పడం వైరల్‌గా మారింది.
ఇంతకీ ఆ మొక్క ఏంటో తెలుసా? యాలకల మొక్క. యాలకలు పర్సులో పెట్టుకుంటే డబ్బుకి లోటుండదు ఇప్పటికే చాలా మంది చెప్పి చెప్పి ఊదరగొట్టేసారు. అది నిజమో కాదో మరి అనుభవం చెందినవారే చెప్పాలి.
లక్ష్మీ దేవికి యాలకుల నుంచి వచ్చే సువాసన అంటే ఎంతో ఇష్టమట. అందుకే చాలా మటుకు లక్ష్మీ దేవి ఆలయాల్లో ప్రత్యేకమైన రోజుల్లో యాలకుల మాలను వేస్తుంటారు.
ఒకవేళ ఈ యాలకుల మొక్కను మీరు కూడా తెచ్చి పెంచుకోవాలి అనుకుంటే.. ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లోకి తెచ్చుకోకూడదు. కేవలం బుధవారం రోజే ఈ మొక్కను ఇంటికి తెచ్చుకోవాలి. లేదా బుధ రాశులు, బుధ నక్షత్రాల రోజైనా తెచ్చుకోవచ్చు.
మొక్కను కుండీలో కాకుండా గాజు, పింగాణీ బౌల్స్‌లో నీళ్లు పోసి ఉంచాలి. పూజ గదిలో లక్ష్మీదేవి వద్ద ఉంచి ధూప దీపాలు వెలిగించి.. ఎండుద్రాక్ష నైవేధ్యంగా పెట్టి… హారతి ఇచ్చి అమ్మవారి ముందు సంకల్పం చెప్పుకుని ఆ తర్వాత మీ ఇంట్లో ఉత్తర దిక్కుగా ఉంచండి.
మీకు దుకాణాలు ఉన్నా కార్యాలయాలు ఉన్నా అక్కడ కూడా ఉత్తర దిక్కుగా ఉంచుకోవచ్చు. మొక్కకు కుంకుమ అస్సలు పెట్టకూడదు. కాస్త గంధం చిలకరించండి.
మీ ఇంట్లో తులసి మొక్కను ఎంత పవిత్రంగా జాగ్రత్తగా చూసుకుంటారో ఈ మొక్కను కూడా అలాగే చూసుకోవాలి.





