Greenland సాధారణంగా మనం ఇల్లు కట్టుకోవాలన్నా, కొనుక్కోవాలన్నా ఆ ఇల్లు ఉన్న భూమి కూడా మనదే అయ్యుండాలి. అందుకే మన భారతదేశంలో భూములకు అంత విలువ.
కానీ ఈ ప్రాంతంలో మాత్రం భూమిని కొనుగోలు చేయలేరు కానీ ఇంటిని మాత్రం నచ్చిన చోట నిర్మించుకోవచ్చు. ఎక్కడో తెలుసా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్నేసిన గ్రీన్ ల్యాండ్స్.
డెన్మార్క్‌లో ఇండిపెండెంట్ భూభాగంగా ఉన్న గ్రీన్‌ల్యాండ్స్‌లో అక్కడి పౌరులు కూడా భూమిని కొనుగోలు చేయలేరు. ఎందుకంటే ఆ భూమి అందరిదీ. మరి ఇల్లు ఎలా కట్టుకోవాలి? అనుకుంటున్నారా?
లోకల్ ఆఫీసర్ల దగ్గర ఓ అప్లికేషన్ పెట్టి ఫలానా చోట ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నట్లు చెప్తే ఆ భూభాగంలో ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇస్తారు. అంతేకానీ ఇన్ని గజాలు కొనుక్కుంటాను అంటే మాత్రం కుదరదు.
ఇంకో విషయం ఏంటంటే.. గ్రీన్‌ల్యాండ్స్‌లో ఏదన్నా ప్రాపర్టీ కొనుగోలు చేయాలంటే అక్కడి పౌరులకు, డెన్మార్క్ వాసులకు, ఫారో ద్వీపానికి చెందిన పౌరులకు మాత్రం అనుమతి ఉంటుంది.
విదేశీయులు అక్కడ ప్రాపర్టీ కొనుక్కోవాలంటే మాత్రం ట్యాక్సులు కడుతూ కనీసం రెండేళ్లు ఎదురు చూడాల్సిందే. గ్రీన్‌ల్యాండ్స్‌లో నివసించే వారు తమ ఇంటిని ఎవరికైనా అమ్మాలన్నా కూడా ప్రభుత్వం పర్మిషన్ అవసరం ఉంటుంది.
ఎందుకంటే ఆ ఇంటిపై ప్రభుత్వానికి హక్కు లేకపోయినా ఆ ఇల్లు ఉన్న భూమిపై మాత్రం హక్కు ఉంటుంది. అలాగని గ్రీన్‌ల్యాండ్‌లో ఇల్లు కొనుక్కోవడం తేలిక కాదు.
ఇల్లు కట్టుకోవాలన్నా కొనుక్కోవాలన్నా అప్లికేషన్ పెట్టిన 12 ఏళ్ల తర్వాత అనుమతి ఇస్తారు. ఎందుకంటే అక్కడ ఇళ్లు చాలా అంటే చాలా తక్కువ. రెంట్‌కి ఉండాలన్నా లక్షల్లో అద్దెలు చెల్లించాల్సిన పరిస్థితి.





