Round Wells: పొలాల వద్ద.. ఇళ్ల దగ్గర బావులు తవ్వుతూ ఉంటారు. ఏ బావి చూసినా మనకు గుండ్రంగానే కనిపిస్తుంది. అలా గుండ్రంగా మాత్రమే బావి ఎందుకు ఉంటుంది అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? ట్రయాంగిల్ ఆకారంలో కానీ స్వ్కేర్ షేప్‌లో కానీ ఎందుకు ఉండవు అని ఎప్పుడైనా అనుకున్నారా? దీని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇలా బావులు గుండ్రంగా ఉండటానికి వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అవేంటంటే..
బావి గుండ్రంగా ఉన్నప్పుడు అందులో ఉన్న నీరు వల్ల చుట్టూ గోడలకు సమానమైన ప్రెషర్ ఉంటుంది. దీని వల్ల ప్రెషర్ బ్యాలెన్స్ అవుతుంది. ఫలితంగా ఏళ్ల పాటు బావి పదిలంగా ఉంటుంది.
ఒకవేళ బావిని ట్రయాంగిల్ లేదా స్క్వేర్ షేప్‌లో నిర్మించి ఉంటే నీటి ప్రెషర్ మూలల్లో ఎక్కువగా పడుతుంది. దీని వల్ల ఆ మూలల్లో పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది. అలా పగుళ్లు రావడం వల్ల కొన్ని నెలల్లోనే బావి కూలిపోతుంది.
ఇంజినీరింగ్ రూల్స్ ప్రకారం.. ఏ నిర్మాణం అయినా గుండ్రంగా నిర్మించినప్పుడే పదిలంగా ఉంటుందట. అందుకే పాతకాలంలో కోటలు, చర్చిలు, మసీదులు గుండ్రంగా ఉండే డోమ్‌లను వాడి నిర్మించేవారు. (Round Wells)
ట్రయాంగిల్, స్వ్కేర్ ఆకారంలో కన్నా గుండ్రంగా ఉండే బావులను సులువగా నిర్మించగలం. బావులను తవ్వేటప్పుడే అది సహజంగానే గుండ్రటి ఆకారంలో ఏర్పడిపోతుంది. శుభ్రం చేయడానికి కూడా వీలుగా ఉంటుంది.
గుండ్రటి బావులను నిర్మించేందుకు తక్కువ ఇటుకలు, సిమెంట్ వాడాల్సి ఉంటుంది. అదే ఇతర ఆకారాల్లో నిర్మించాలంటే చాలా మెటీరియల్ కావాలి.
గుండ్రటి బావుల్లోని నీరు చాలా కాలం పాటు శుభ్రంగా ఉంటుంది. బావులు గుండ్రంగా ఉంటేనే భూకంపాలు, ఇతర ప్రమాదాలు సంభవించినప్పుడు నిలకడగా ఉంటుంది.