Vasantha Panchami సంక్రాంతి సమయంలో వసంత పంచమి నాడు పతంగులు ఎగరేస్తుంటారు. అందుకే విదేశాల్లో సంక్రాంతికి కైట్స్ ఫెస్టివల్ అంటుంటారు. దీని వెనుక ఓ కారణం ఉంది. అదేంటో తెలుసా?
సంక్రాంతి, వసంత పంచమి ఏడాదిలో వచ్చే తొలి పండుగలు. అంటే శుభాలకు ప్రారంభం. పతంగులు ఎగరేయడానికి కారణం.. పతంగులు గాలి లేకపోతే ఎగరలేవు. ఎక్కువ గాలి ఉన్నా అంతే.
ఆ గాలి సరిగ్గా ఉన్నప్పుడు ఆకాశంలో తేలిపోతూ ఉంటాయి. మనిషి జీవితం కూడా అంతే. ఎన్ని కష్టాలున్నా ఆ పతంగిలాగే సమయం కోసం ఎదురుచూసి కొత్త ఆశలతో ఎగరాలని అర్థం.
పతంగులు ఆకాశంలో ఎలా ఎగురుతాయో మనిషి కోరికలు, ఆశలు కూడా అంతే ఎత్తున ఎగిరేలా ఎదిగేలా ఉండాలి అని చెప్తారు. దానికి సూచకంగానే పతంగులు ఎగరవేస్తుంటారు.
ఈ వసంత పంచమిని ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా జరుపుకుంటారు. మన దగ్గర సంగీత వాయిద్యాలు, పుస్తకాలు, పరికరాలను పూజిస్తారు.
ఉత్తరాఖండ్‌లో సరస్వతి, శివపార్వతులను పూజిస్తారు. స్థానిక కళ అయిన ఝుమేలియా, చౌన్‌ఫులాను నిర్వహిస్తారు.
రాజస్థాన్‌లో మల్లె పువ్వులు ధరించి పసుపు రంగు పూలతో పూజలు నిర్వహిస్తారు. మహారాష్ట్రలో కొత్తగా పెళ్లైన జంటలతో పసుపు రంగు దుస్తులు వేయించి పూజలు చేయిస్తారు.
పశ్చిమ బెంగాల్, బిహార్‌లో అక్షరాభ్యాసం చేయిస్తారు. బిహార్‌లోని దేవో సూర్య ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.





