Virat Kohli Relationships: పై ఫోటోలో కనిపిస్తున్న జంటను చూసారా? అక్కడ ఉన్నది స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అని మనకు తెలుసు. కానీ అతని పక్కన ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా? ఆ అమ్మాయి కూడా క్రికెటరే. కాకపోతే ఇంగ్లాండ్ క్రికెటర్. పేరు డ్యానియల్ వ్యాట్ (Danielle Wyatt). గతేడాది జరిగిన ICC మహిళల టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఆడింది. విరాట్ కోహ్లీకి బాలీవుడ్ నటి అనుష్క శర్మతో (Anushka Sharma) పెళ్లి అయిపోయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు వీరిద్దరి టాపిక్ ఎందుకొచ్చింది అనుకుంటున్నారా? మ్యాటర్ ఏంటంటే.. డ్యానియల్ విరాట్‌కు వీరాభిమాని. అయితే ఆ అభిమానం ఆట వరకే కాదు. వ్యక్తిగతంగానూ ఉంది. విరాట్‌ని డ్యానియల్ చాలా ఇష్టపడింది. అతను ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకోవాలనుకుంది. 2014లో సోషల్ మీడియా వేదికగా విరాట్‌కు ప్రపోజ్ కూడా చేసింది. విరాట్ అప్పటికే అనుష్క శర్మతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. పైగా ఇలాంటి వాటికి స్పందించి అనవసర విషయాల్లో హైలైట్ కాకూడదని విరాట్ అనుకున్నాడు. అందుకే సైలెంట్‌గా ఆమెతో ఓ ఫోటో దిగి వెళ్లిపోయాడు.
అనుష్క విరాట్ కోహ్లీలు పెళ్లి చేసుకున్నారని తెలిసి డ్యానియల్ వారికి కంగ్రాట్స్ కూడా చెప్పింది. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్యానియల్ ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది. ఫుట్‌బాల్ గేమ్ ఏజెంట్ అయిన జార్జీ హోడ్జ్‌తో డ్యానియల్ చాలా కాలం పాటు ప్రేమలో ఉంది. గతేడాది జూన్‌లో వీరిద్దరూ సౌతాఫ్రికాలో పెళ్లి చేసుకున్నారు. తమ పెళ్లి విషయాన్ని ముందు రహస్యంగా ఉంచిన డ్యానియల్ ఆగస్ట్‌లో తాను ఇలా ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించింది. దాంతో చాలా మంది షాకయ్యారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్. ఇదేంట్రా బాబూ విరాట్‌ని ప్రేమిస్తున్నానంటూ అతనికి సోషల్ మీడియాలో ప్రపోజ్ చేసి ఇప్పుడు ఏకంగా అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంది అంటూ పాపం ఆమె పెట్టిన పోస్ట్‌ల కింద తెగ కామెంట్స్ చేసారు. (Virat Kohli Relationships)
ఆ తర్వాత తెలిసింది ఏంటంటే.. ఆమె బై సెక్సువల్ అట. అంటే రెండు లింగాల వారికి వారు ఆకర్షితులు అవుతారు. అందుకే ఆమె జార్జియా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంది. ఈ విషయంపై ఆమెను ఎంత మంది ట్రోల్ చేసినా పట్టించుకోలేదు. కోహ్లీ అంటే ఇప్పటికీ తనకు అభిమానమే అని చెప్తోంది. కోహ్లీతో మాత్రమే కాదు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ కొడుకు అర్జున్ తెందుల్కర్‌తోనూ డ్యానియల్‌కు మంచి స్నేహం ఉంది.