Pawan Kalyan రాజ్యసభలో జూన్ నాటికి నాలుగు ఎంపీ సీట్లు ఖాళీ కానున్నాయి. వాటిలో మూడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవి.. ఒకటి తెలుగు దేశం పార్టీది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆళ్ల అయోధ్యరామి రెడ్డి, పిల్లి సుభాష్ చంద్ర బోస్, పరిమళ్ నథ్వాలీలు తెలుగు దేశం నుంచి సానా సతీష్ రిటైర్ కానున్నారు.
ఈ నేపథ్యంలో కూటమి ఆ నాలుగు సీట్లను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ మరో రెండు సీట్లు కావాలని తెలుగు దేశం పార్టీని అడిగినట్లు కూడా సమచారం.
ఇక మరోపక్క జనసేన కూడా ఒక సీటు ప్లాన్‌లో ఉంది. అధినేత పవన్ కళ్యాణ్ ఇండస్ట్రియలిస్ట్ లింగమనేని రమేష్‌కి సీటు కేటాయించాలని చూస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే ఇది తొలి రాజ్యసభ సీటు జనసేనకు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్టీలోని సీనియర్ నేతలు, పార్టీ కోసమే నిరంతరం కష్టపడుతున్న వాళ్లు బాధపడుతున్నారట. పార్టీని అంటిపెట్టుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న వాళ్లని వదిలేసి లింగమనేని రమేష్‌కి ఇవ్వడమేంటి అనే చర్చ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది.
ఇప్పటికే అసలు ఎలాంటి అర్హత లేని తన సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై చాలా మంది మండిపడుతున్నారు.
అదీకాకుండా అమరావతి ఇన్నర్ ఎలైన్మెంట్ వల్ల లింగమనేని చాలా లాభపడ్డారని.. ఈ అంశంపై పవన్ ఎక్కడ ప్రశ్నిస్తాడో అని ఆయనకు రూ.6 కోట్ల భూమిని అత్యంత తక్కువ రేటుకు అమ్మినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు కూడా చేస్తూ వచ్చింది.
మరి అలాంటి వ్యక్తికి పవన్ ఇప్పుడు రాజ్యసభ సీటు కట్టబెడితే పవన్‌పై మరింత నెగిటివిటీ పెరిగిపోయే ప్రమాదం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.





