Women’s Premier League: మహిళల ప్రీమియర్ లీగ్‌లో (WPL 2025) తొలిసారి జపాన్ అమ్మాయి చోటు దక్కించుకుంది. 21 ఏళ్ల అహిల్యా చందేల్ (Ahalya Chandel) అనే జపనీస్ అమ్మాయి మహిళల ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనబోతోంది. అహల్య లెఫ్ట్ ఆర్మ్ పేసర్. అయితే అహల్య డైరెక్ట్ ప్లేయర్ కాదు. టీంలో ఎవరైనా గాయపడితే అప్పుడు అహల్యకు ఆడే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఏ టీం అహల్యను సెలెక్ట్ చేసిందో తెలుసా? ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals). ఢిల్లీ క్యాపిటల్స్ అహల్యను నెట్ బౌలర్‌గా ఎంపికచేసింది. WPL రూల్ ప్రకారం ఐదుగురు విదేశీ ప్లేయర్లను ఎంపికచేసుకునే అవకాశం ఉంది.
ఎవరీ అహల్య? (Who is Ahalya Chandel)
Women’s Premier League అహల్య తండ్రి భారతీయుడే. తల్లి జపాన్‌కి చెందినవారు. వీరిది ప్రేమ వివాహం. అహల్య తండ్రి కూడా క్రికెటరే కావడంతో ఎనిమిదేళ్ల వయసులోనే ఆమెకు క్రికెట్ పట్ల ఆసక్తి కలిగింది. 2022లో జపాన్ తరఫున హాంగ్‌కాంగ్‌పై తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. ఎక్కువగా అహల్య జపాన్, ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడుతుంది.
T20I క్రికెట్‌లో జపాన్ ఆల్ టైం లీడింగ్ వికెట్ టేకర్‌గా పేరు తెచ్చుకుంది.
31 T20I మ్యాచ్‌లలో 30 వికెట్లు తీసింది.
మహిళల T20Iలలో డబుల్ హ్యాట్రిక్ చేసిన నలుగురు బౌలర్లలో అహల్య ఒకరు
ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ మహిళల ప్రీమియర్ కప్‌లో చైనాపై ఆడి డబుల్ హ్యాట్రిక్ వికెట్లు తీసింది.