Surya Grahanam ఈసారి సూర్యగ్రహణం శివరాత్రికి ఉగాది మధ్యలో రాబోతోంది. ఈసారి ఏర్పడబోయే గ్రహణం రింగ్ ఆఫ్ ఫైర్‌లా ఉండబోతోంది.
ఈ రాహు గ్రస్త సూర్యగ్రహణం ఫిబ్రవరి 17, ధనిష్ఠ నక్షత్రం నాలుగవ పాదంలో మాఘ బహుళ అమావాస్య రోజు ఏర్పడబోతోంది.
మధ్యాహ్నం 3:26 నుంచి రాత్రి 7:50 నిమిషాల వరకు ఉంటుంది. ఈ గ్రహణం వల్ల నాలుగు రాశుల వారికి లక్కీ అనే చెప్పాలి.
అవేంటంటే.. ధనస్సు, మేష, వృషభ, కన్య.
ధనస్సు రాశి వారికి స్థైర్యం, ధైర్యం పెరుగుతుంది. ఆర్థిక లాభాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు కలిసొస్తాయి.
మేష రాశి వారికి ఉద్యోగంలో లాభాలు, స్థానచలన లాభాలు, సరికొత్త పరిచయాలు, వ్యాపారాలు బాగుంటాయి.
వృషభ రాశి వారికి అద్భుతమైన లాభాలు, మనోభీష్టాలు సిద్ధిస్తాయి, సుఖ ప్రాప్తి ఉంది.
కన్యా రాశి వారికి శత్రువులపై విజయం, ఎన్నో ఏళ్లుగా ఇబ్బందిపెడుతున్న సమస్యలు తీరిపోతాయి.
అశుభం కలిగే రాశి ఏదన్నా ఉందంటే అది కుంభ, మీనం, వృశ్చిక, కర్కాటక రాశులు. కుంభ రాశి వారికి అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి.
మీన రాశి వారికి విపరీతమైన ఖర్చులు, అప్పులు, బాధలు, ఆస్తులు తాకట్టు పెట్టుకోవడాలు, డబ్బు పోవడాలు వంటివి ఉన్నాయి.
వృశ్చిక రాశి వారికి గృహ త్యాగాలు, తల్లికి అనారోగ్యం, ఇంట్లో సమస్యలు, తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది.
కర్కాటక రాశి వారికి అనారోగ్య సమస్యలు, దెబ్బలు, బాధలు. కర్కాటక రాశి వారు ఎక్కడపడితే అక్కడ తినడాలు మానుకోవాలి. వీరికి అష్టమంలో ఉంది కాబట్టి ఆయుర్భంగం ఉంటుంది.
ఇక మిగతా రాశులైన మకర, తుల, సింహ రాశులకు సాధారణ ఫలితాలు ఉంటాయి.





