Ugadi 2025: ఈ నెల 30న ఉగాది. విశ్వావసు నామ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం. అయితే.. మనకు దాదాపు అన్ని పండుగలకు సంబంధించి ప్రత్యేక పూజలు ఉన్నాయి. అంటే.. వినాయక చవితి రోజున గణనాథుడిని పూజిస్తాం.. దీపావళి నాడు లక్మీదేవి.. శివరాత్రి నాడు పరమశివుడిని ఆరాధిస్తుంటాం. మరి మనకు నూతన సంవత్సరం అయిన ఉగాది రోజున ఏ దేవుడిని పూజించాలి అనే సందేహం చాలా మందికే ఉంటుంది.
ఉగాది రోజున కలి పురుషుడిని పూజిస్తారు. కలి పురుషుడి పూజా విధానం వస్తే చేసుకోవచ్చు. లేదా ఆయనకు సంబంధించిన శ్లోకాలు, స్తోత్రాలు తెలిసినా చదువుకోవచ్చు. అసలు అవేమీ కావు అనుకుంటే చక్కగా విష్ణు సహస్ర నామం చదువుతూ పూజ చేసుకుంటే సంవత్సరం అంతా బాగుంటుంది. చదవడం రాకపోతే కనీసం వింటూ అయినా పూజా విధానంలో పాల్గొంటే ఉత్తమం.