Fruits: మీరు ఎప్పుడైనా పండ్లు కొనుగోలు చేసేటప్పుడు వాటిపై స్టిక్కర్లు అంటించి ఉండటం గమనించే ఉంటారు. ఎప్పుడైనా ఆలోచించారా అసలు వాటిని ఎందుకు అతికిస్తారు.. వాటిపై ఉండే అంకెలు ఏంటి అని? దీని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం.
9 నెంబర్‌తో మొదలయ్యే 5 అంకెల కోడ్ ఉండే దాని అర్థం పండు సేంద్రీయంగా పండించినదని.. ఎలాంటి క్రిమిసంహారాలు వాడలేదని అర్థం.
8వ నెంబర్‌తో మొదలయ్యే కోడ్ ఉంటే స్వల్పంగా క్రిమిసంహారాలు వాడి పండించిన పండు అని అర్థం
3వ నెంబర్‌తో మొదలయ్యే 4 అంకెల కోడ్ ఉంటే పండ్లు ఎక్స్‌రేలకు ఎక్స్‌పోజ్ అయ్యాయని.. తినగలం కానీ దాని నుంచి ఎలాంటి పోషకాలు అందవని అర్థం.
మరో 4 అంకెల కోడ్ ఉన్న స్టిక్కర్లు అంటించి ఉంటే మాత్రం ఆ పండ్ల నిండా రసాయనాలే ఉన్నాయని.. వాటిని తినకపోవడమే మంచిదని గుర్తుంచుకోవాలి.