Anant Ambani: అర్జెంటినా ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ ఇటీవల భారత్‌లో సందడి చేసిన సంగతి తెలిసిందే. కలకత్తాలో ల్యాండ్ అయిన మెస్సీ ఆ తర్వాత హైదరాబాద్‌లోనూ సందడి చేసాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫుట్‌బాల్ కూడా ఆడారు. ఆ తర్వాత ముంబై వెళ్లాడు. ఏ అంతర్జాతీయ సెలబ్రిటీ ముంబైలో అడుగుపెట్టినా ముందుగా కలిసేది అంబానీలనే అనేది అందరికీ తెలిసిందే. అలా ముఖేష్ అంబానీ చిన్న కుమారుడైన అనంత్ అంబానీని మెస్సీ కలిసాడు. వారితో కలిసి గణనాథుడికి హారతి కూడా ఇచ్చాడు. మెస్సీ అంబానీ ఇంటికి వచ్చిన సందర్భంగా అనంత్ ఖరీదైన అరుదైన కానుకను మెస్సీకి ఇచ్చాడు.
ఇంతకీ అనంత్ మెస్సీకి ఇచ్చిన కానుక ఏంటంటే.. రిచర్డ్ మిల్ 003-V2 GMT వాచ్. అనంత్‌కు వాచెస్ అంటే చాలా ఇష్టం. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన బ్రాండ్లకు చెందిన లిమిటెడ్ ఎడిషన్ వాచెస్ అన్నీ కూడా అనంత్ దగ్గర ఉన్నాయి. అనంత్ మెస్సీకి ఇచ్చింది టూర్బిలన్ ఏషియా ఎడిషన్ వాచ్. ఈ వాచ్ ప్రపంచంలో కేవలం 12 పీసులు మాత్రమే ఉన్నాయి. ఆ 12వ పీస్ ఇప్పుడు మెస్సీ వద్ద ఉంది. దీని ధర రూ.10.91 కోట్లు. ఈ రిచర్డ్ మిల్ వాచ్‌లో అనంత్ దగ్గర RM 056 సాఫైర్ టూర్బిలన్ ఎడిషన్ ఉంది. దీని ధర రూ. 45.59 కోట్లు.
ఈ బ్రాండ్ వాచీలు ధరించే సెలబ్రిటీలు వీరే
రఫేల్ నాదల్
విరాట్ కోహ్లీ
క్రిస్టియానో రొనాల్డో
Jay-Z
ఫారెల్ విలియమ్స్
లూయిస్ హ్యామిల్టన్
ఈ బ్రాండ్ వాచీలు చాలా మంది సెలబ్రిటీల వద్ద ఉన్నాయి. కానీ అనంత్ అంబానీ మెస్సీకి ఇచ్చిన వాచీ మాత్రం ప్రపంచంలో కేవలం 12 మంది వద్దే ఉంది.





