Udit Narayan: ఉదిత్ నారాయణ్.. 80, 90ల్లో ఈయన పాటలకు పిచ్చి క్రేజ్ ఉండేది. అఫ్‌కోర్స్ ఆ క్రేజ్ ఇప్పటికీ ఉందనుకోండి. అందుకే ఆయన ఈ వయసులోనూ లైవ్ కాన్సర్ట్‌లు ఇస్తున్నారు. కానీ ఆయన అద్భుతమైన వాయిస్‌తో పాడే పాటల కంటే ఫీమేల్ ఫ్యాన్స్, ఫీమేల్ సింగర్స్ పట్ల ప్రవర్తించే తీరు విషయంలోనే ఎక్కువ వైరల్ అవుతున్నారు. మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ టాపిక్ దేని గురించి అని. ఇటీవల ఉదిత్ నారాయణ్ ఓ లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు.
టిప్ టిప్ బర్సా పానీ అనే పాట పాడుతుండగా.. ఓ అమ్మాయి ఆయనతో కలిసి సెల్ఫీ తీసుకోవాలనుకుంది. స్టేజ్ దగ్గరికి వెళ్లి సర్ సెల్ఫీ అని అడిగింది. ఆయన ఇందుకు ఒప్పుకుని ఆమెతో సెల్ఫీ దిగారు. అయితే.. సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ఆ అమ్మాయి ఉదిత్ బుగ్గపై ముద్దిచ్చింది. ఆయన దొరికిందే ఛాన్స్ అనుకున్నాడో ఏమో.. వెంటనే ఆ అమ్మాయికి లిప్ కిస్ ఇచ్చేసాడు. దాంతో ఆ అమ్మాయితో పాటు అక్కడున్నవారంతా షాకయ్యారు. ఎందుకంటే.. ఉదిత్ నారాయణ్ లాంటి సీనియర్ మోస్ట్ సింగర్ ఇలా ప్రవర్తిస్తారని ఆయన అభిమానులు కల్లో కూడా ఊహించి ఉండరు. ఉదిత్ వయసేంటి ఆయన చేసే పనులేంటి అని చాలా మంది మండిపడుతున్నారు. ఇప్పటికే ఆయన ట్విటర్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతున్నారు.
Udit Narayan ఇలా ఒక అమ్మాయికి లిప్ కిస్ ఇచ్చిన ఉదిత్.. అది తప్పు కాదు అని తనని తాను సమర్ధించుకుంటూ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అది తన అభిమానిపై తనకున్న ప్రేమను చాటడమే తప్ప ఏదో కామంతో చేసినది కాదని అన్నారు. తాను చేసింది తప్పయితే ఆ అమ్మాయి తనకు బుగ్గపై ముద్దివ్వడం కూడా తప్పే కదా అన్నారు. ఫ్యాన్స్ తన పాటలను వింటూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారే తప్ప.. సింగర్స్‌గా తాము మాత్రం అంతటి దిగజారుడు పనులు చేయం అని తెలిపారు. అసలు ఏమీ లేని దానిని హైలైట్ చేసి వీడియోలు వేసి వైరల్ చేస్తున్నారని.. దీనికి ఇంత అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదని అంటున్నారు.
ఉదిత్ ప్రవర్తన పట్ల మహిళా సంఘాలు, అభిమానులు పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఆయన ఇప్పటివరకు ఒక్కసారి కూడా క్షమాపణలు చెప్పలేదు. ఉదిత్ నారాయణ్‌కు ఇలాంటి వివాదాలు కొత్తేం కాదు. 2019లో దివంగత గాయని లతా మంగేష్కర్ విషయంలోనూ ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. తన కెరీర్ మొత్తంలో లతా మంగేష్కర్‌తో కలిసి చాలా పాటలు పాడినప్పటికీ.. తనకు నచ్చినప్పుడు మాత్రం ఆమెతో కలిసి పాడలేకపోయానని అన్నారు.
Udit Narayan దాంతో ఆయన వ్యాఖ్యల పట్ల తీవ్ర దుమారం చెలరేగింది. లతా మంగేష్కర్‌తో కలిసి పాడే అవకాశం చాలా సార్లు వచ్చినప్పటికీ.. కోరుకున్నప్పుడు మాత్రం రాలేదు అనడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ఆయనపై విమర్శలు వచ్చాయి. ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్‌తోనూ ఉదిత్‌కు విభేదాలు ఉన్నాయి. 90ల కాలంలో అను మాలిక్ కంపోజ్ చేసిన పాటలకు ఉదిత్ గాత్రం అందించారు. కానీ అను మాలిక్‌కి మాత్రమే క్రెడిట్ దక్కేదని.. తనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని ఆయన అభిప్రాయపడ్డారు.