Trinadha Rao Nakkina: ఆల్రెడీ చిత్రపరిశ్రమలో దర్శకులు, హీరోలు ఆడవారి పట్ల ఎలా ప్రవర్తిస్తుంటారో ఎన్నో సంఘటనలు బయటికి వచ్చాయి. ఫలానా దర్శకుడు నన్ను వేధించాడు.. ఫలానా నిర్మాత నాతో ఇలా అసభ్యకరంగా ప్రవర్తించాడు అని ఎంతో మంది బాధితులు బయటికి వచ్చి తమకు ఎదురైన వేధింపుల గురించి బయటపెట్టారు. ఆ తర్వాత ఇదో పెద్ద మీటూ అనే ఉద్యమానికి దారి తీసింది. ఎన్ని ఉద్యమాలు వచ్చినా కొందరి ప్రవర్తన మారదు అని చెప్పడానికి ఈ దర్శకుడే నిదర్శనం. ఇతని పేరు త్రినాధ రావు నక్కిన. సందీప్ కిషన్‌తో (Sandeep Kishan) మజాకా (Mazaka) అనే సినిమా తీసారు. మన్మథుడు సినిమాలో మహేశ్వరి పాత్రలో నటించిన అన్షు (Anshu) చాలా కాలం తర్వాత ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. రీతూ వర్మ (Ritu Varma) హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా టీజర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. టీజర్ రిలీజ్ సమయంలో త్రినాథ రావు హీరోయిన్ల గురించి మాట్లాడుతూ అసభ్యకరమైన కామెంట్స్ చేసాడు.
అన్షు చాలా కాలం తర్వాత తెలుగు సినిమాలో నటించేందుకు ఒప్పుకుందని తెలిసి తాను చాలా సంతోషించానని.. అప్పటికి ఇప్పటికి అలాగే ఉన్నప్పటికీ కాస్త సన్నబడిందని అన్నారు. ఇక్కడితో ఆపేసి ఉంటే ఏ గొడవా ఉండేది కాదు. కొంచెం తిని పెంచమ్మా తెలుగుకి సరిపోదు అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా అని దరిద్రంగా మాట్లాడాడు. ఆయన మాటలు అన్షుకి అర్థం అయినట్లు ఉన్నాయి. పాపం చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీలైంది. ఇలాంటి వారిని స్టేజ్ మీదే చెప్పుతో కొట్టాలంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏదన్నా సినిమా హిట్ అవ్వగానే దర్శకులు, నిర్మాతలు ఓవరాక్షన్ చేస్తుంటారని.. వారి మాటలకు అడ్డు అదుపు ఉండదని మండిపడుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల మజాకా సినిమాకు బ్యాడ్ నేమ్ వచ్చే ఛాన్స్ ఉందని సినిమా ఫ్లాపైతే అప్పుడు తెలుస్తుంది అంటూ గడ్డిపెడుతున్నారు. ఈ త్రినాథరావు అనే వ్యక్తిపై మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు యాక్షన్ తీసుకోవాలని కోరుకుందాం. (Trinadha Rao Nakkina)