Tollywood: టాలీవుడ్‌లో రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తీస్తున్న సినిమాగా వారణాసి రికార్డు నెలకొల్పింది. సినిమా సినిమాకు బడ్జెట్ పెంచుకుంటూ పోవడం జక్కన్నకు అలవాటే అనుకోండి. అయితే.. టాలీవుడ్‌లో తొలిసారి కోటి రూపాయల బడ్జెట్‌తో తీసిన సినిమా ఎవరిదో తెలుసా? తొలి రూ.1000 కోట్ల సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుది అయితే.. కోటి రూపాయల సినిమా ఆయన తండ్రి, దివంగత నటుడు సూపర్‌స్టార్ కృష్ణది. కృష్ణ నటించిన సింహాసనం సినిమా బడ్జెట్ రూ.1 కోటి. అక్కడి నుంచే కోటిని మించిన బడ్జెట్‌తో సినిమాలు తీయడం మొదలుపెడుతూ వచ్చారు. అలా ఇప్పుడు టాలీవుడ్ బడ్జెట్ రేంజ్ రూ.1000 కోట్లకు చేరింది. సింహాసనం రూ.1 కోటి అంటున్నారు కానీ.. రూ.3.5 కోట్ల వరకు అయ్యిందని టాక్. సింహాసనం తర్వాత వచ్చిన సినిమాల లిస్ట్ ఇదే.
తొలి రూ.5 కోట్లతో తీసిన సినిమా- అన్నమయ్య
తొలి రూ.10 కోట్లతో తీసిన సినిమా – ఒక్కడు
తొలి రూ.25 కోట్లతో తీసిన సినిమా – సైనికుడు
తొలి రూ.50 కోట్లతో తీసిన సినిమా – నేనొక్కడినే
తొలి రూ.100 కోట్లతో తీసిన సినిమా- బాహుబలి
తొలి రూ. 500 కోట్లతో తీసిన సినిమా – RRR
తొలి రూ.1000 కోట్లతో తీస్తున్న సినిమా – వారణాసి





