TJR Sudhakar Babu కాటికి కాలు చాచిన వయసులో అయినా చంద్రబాబు నాయుడు నిజాలు చెప్తాడేమో అనుకుంటే ఇప్పుడూ అబద్ధాలే చెప్తున్నాడని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు. ఈరోజు దివంగత నేత నందమూరి తారక రామారావు వర్ధంతి సంరద్భంగా చంద్రబాబు నాయుడు ప్రెస్‌మీట్ నిర్వహించారు.
ఆ ప్రెస్‌మీట్‌లో పిన్ని తాళిబొట్టు తెంపిన వారు అంటూ తమ అధినేత జగన్ మోహన్ రెడ్డి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసారని మండిపడ్డారు. నిజానికి నందమూరి తారక రామారావు ప్రేమించి పెళ్లి చేసుకున్న లక్ష్మీ పార్వతి తాళిబొట్టు తెంపింది చంద్రబాబు నాయుడే కదా అని ప్రశ్నించారు.
రామారావు లక్ష్మీ పార్వతిని తిరుమల శ్రీవారి ఎదుట పెళ్లి చేసుకున్నాడని.. ఈ వివాహానికి సాక్ష్యం మోహన్ బాబే అని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలైన రషీద్, సాల్మన్‌లను చంపి వారి భార్యల తాళిబొట్లు తెగ్గొట్టిన చంద్రబాబుకి ఏమాత్రం సిగ్గున్నా ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేవారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
తారక రామారావు పార్టీ పెట్టిన తర్వాత పార్టీలో చేరి మొదటి అల్లుడైన దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి పార్టీ బాధ్యత అప్పగించకుండా చంద్రబాబుకి అప్పగించారంటే ఎలా నమ్ముతారని.. ఆయన్ను బాధపెట్టి మోసం చేసి పార్టీ లాక్కున్నారు కాబట్టే ఇన్ని సార్లు ప్రజలను మోసం చేస్తూ ముఖ్యమంత్రి అవుతూ వచ్చారని ఎద్దేవా చేసారు.
ఇప్పుడున్న యువత తాను ఏం చెప్తే అదే నమ్ముతారు అనుకుంటూ నోటికొచ్చిన అబద్ధాలు ఆడుతున్నాడని.. తారక రామారావు చరిత్ర చదివితే చంద్రబాబు ఎంత నీచుడో వారికి తెలుస్తుందని మండిపడ్డారు.





