Thula Rasi Horoscope: ఇప్పటి వరకు తులా రాశి వారు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉండొచ్చు. మరి ద్వాదశ రాశులకు మకర సంక్రమణం తర్వాత ఏ విధంగా ఉండబోతోంది? పరిస్థితుల్లో ఏమైనా మార్పులు రాబోతున్నాయా? ఒకవేళ మార్పులు జరిగినప్పుడు ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు మంచి పరిహారాలు కూడా తెలియాలి కదా..! ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.
ఈసారి గ్రహ గతులు, గ్రహ గమనాలను బట్టి చూసుకుంటే తులా రాశి వారికి అంత సానుకూలంగా లేవనే చెప్పాలి. అయితే.. ఏ రోజుల్లో ప్రధానంగా ఉంటాయి.. ఏ రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయో తెలుసుకుందాం. ఆ ఇబ్బందికర పరిస్థితులకు తగ్గట్టు ఎలా వ్యవహరించాలి అనేది ముఖ్యం. ఈ నెలలో తులా రాశి వారికి కాలం కలిసి రాకపోచ్చు. కానీ భవిష్యత్తు మాత్రం బ్రహ్మాండంగా ఉండబోతోందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ప్రధానంగా తులా రాశి వారికి సంబంధించిన కొన్ని ఫలితాలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ముఖ్యంగా తులా రాశి వారికి జనవరి 31 వరకు తోడబుట్టిన సోదర, సోదరీమణులతో కానీ పరిచయస్తులు, స్నేహితులతో కానీ ఎలాంటి వాగ్వివాదాలు పెట్టుకోకూడదు. (Thula Rasi Horoscope)
ఎవరైనా మీ దగ్గరికి వచ్చి డబ్బు కావాలని అడిగితే చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఈ 31 లోపల మీకు తెలీకుండానే మొహమాటానికి పోయి డబ్బు చాలా నష్టపోతారు. తులా రాశిలో జన్మించిన వారికి గృహం కోసం ఎదురుచూస్తున్న వారికి మాత్రం సంతోషకరమైన వార్తను వింటారని చెప్పుకోవచ్చు. ధైర్యంతో సాహసోపేతమైన నిర్ణయాలు ముందడుగు వేయడం.. నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కానీ మొండి ధైర్యంతో వాటిని అతిక్రమించే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా రెస్టారెంట్లు, హోటళ్లు, సూపర్ మార్కెట్లు, జనరల్ స్టోర్స్, కళాశాలలు, జువెలరీ రంగం, బస్సులు, తీర్థయాత్రలు.. ఇలాంటి వ్యాపారాలు ఉండే వారు సాధారణమైన లాభాలు మాత్రమే పొందుతారు. వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిలకు కచ్చితంగా వివాహం నిశ్చయం అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి నిర్ణయాలు తీసుకునేప్పుడు జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. (Thula Rasi Horoscope)
తెలీకుండానే మీ ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అన్నిటి కంటే ప్రధానంగా ఉద్యోగంలో ప్రశాంతత కోల్పోతారు. తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. వారసత్వంగా రావాల్సిన ఆస్తులకు సంబంధించి కానీ కోర్టు సంబంధిత విషయాల్లో కదలిక ఏర్పడుతుంది. కొంత వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పచ్చు. ముఖ్యంగా విద్యార్థులు కోరుకున్న చోట సీట్లు వచ్చే అవకాశం ఉంది. పట్టుదలతో కష్టపడి ప్రయత్నం చేసేలా మీ నిర్ణయాలు పెట్టుకోండి. తప్పకుండా అన్ని పరీక్షల్లో అర్హత సాధిస్తారు. తులా రాశిలో జన్మించిన లాయర్లు, జడ్జిలు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, భూ సంబంధమైన వ్యాపారాలు చేసేవారు, రైతులు.. వీరికి సాధారణమైన ఫలితాలు మాత్రమే కలుగుతాయి. ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులు ఏవైనా తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ నెల చివర్లో ఉద్యోగాలకు సంబంధించిన చర్చలు వస్తాయి. తద్వారా భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలపై దృష్టిసారిస్తారు. ఎలాంటి సమస్యల నుంచైనా బయటపడటానికి తులా రాశి వారు ఈ జనవరి నెల మొత్తం ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం, దత్త అష్టకం రోజూ మూడు సార్లు చదువుకుంటే అంతా మంచే జరుగుతుంది. (Thula Rasi Horoscope)