Pawan Gift to Sujeeth: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. OG దర్శకుడు సుజీత్‌కు రేంజ్ రోవర్ డిఫెండర్ కారును బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. OG సినిమా బ్లాక్ బస్టర్ అయిన సందర్భంగా పవన్ సుజీత్‌కు మర్చిపోలేని గిఫ్ట్‌ను ఇచ్చారు. అయితే.. పవన్ రేంజ్ రోవర్ డిఫెండర్ కారునే గిఫ్ట్‌గా ఇవ్వడం వెనక ఒక కారణం ఉంది.
మీరు OG సినిమా చూసి ఉంటే.. ఓ సీన్‌లో ఈ కారును కూడా చూపిస్తారు. ఈ కారును పెట్టి సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు తనకు రేంజ్ రోవర్ డిఫెండర్ అంటే చాలా ఇష్టమని పలుమార్లు సుజీత్ పవన్‌కు చెప్పారట. అందుకే ఈ కారునే పెట్టి షూట్ చేయాలనుకున్నట్లు తెలిపాడు. అందుకే పవన్ సుజీత్ ఇష్టపడిన.. సినిమాలో వాడిన ఆ కారునే కానుకగా ఇచ్చి సర్‌ప్రైజ్ చేసారు.





