Supreme Court on DNA Test: ఆర్థిక సమస్యలు ఉన్నాయంటూ ఓ మహిళ, తన 23 ఏళ్ల కుమారుడితో కలిసి వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. వీరి నిర్వాకం సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో ఆ పిటిషన్‌ను క్యాన్సిల్ చేసింది. అసలేం జరిగిందంటే.. కేరళకు చెందిన ఓ మహిళకు ఇద్దరు పిల్లలు. ఒక పాప, బాబు. బాబుకి 23 ఏళ్లు ఉంటాయి. అయితే.. 1980లో ఆ మహిళకు వివాహం జరగ్గా.. 1991లో ఆడపిల్లకు, 2001లో మగపిల్లాడికి జన్మనిచ్చింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల 2003లో భర్తతో విడిపోయింది. వీరికి కోర్టు 2006లో విడాకులు మంజూరు చేయగా.. పిల్లల్నిద్దరినీ తీసుకుని దూరంగా వెళ్లిపోయింది.
ఈ నేపథ్యంలో ఆ మహిళ కొడుకు కేరళ హైకోర్టులో ఓ పిటిషన్ వేసాడు. తాను తన తండ్రికి పుట్టలేదని.. అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల కలిగిన సంతానాన్ని అంటూ తన తండ్రికి DNA పరీక్ష నిర్వహించాలని పిటిషన్‌లో కోరాడు. అయితే.. దీనికి ఆ యువకుడి తండ్రి ఒప్పుకోలేదు. ఇప్పుడెందుకు DNA పరీక్ష చేయాలంటున్నారు? మీరు అక్రమ సంబంధం ద్వారా కలిగిన సంతానం అని ఎవరు చెప్పారు అని కోర్టు అడగ్గా.. తన తల్లి తన పుట్టిన తేదీ సర్టిఫికేట్లలో తండ్రి పేరు మార్చాలని చూసిందని.. దాంతో తనకు అనుమానం మొదలైందని అన్నాడు. అందుకే తనకు తన అసలైన తండ్రి ఎవరో తెలుసుకునేందుకు తన తల్లి కట్టుకున్న భర్తతో డీఎఏ టెస్ట్ చేయించాలని పిటిషన్‌లో కోరాడు. Supreme Court on DNA Test
కానీ ఎందుకు ఇప్పుడే డీఎన్ఏ టెస్ట్ చేయించాలనుకుంటున్నారు అని అడగ్గా.. అప్పుడు వారి అసలు బండారం బయటపడింది. ఆ యువకుడికి అనారోగ్య సమస్యలు ఉన్నాయట. పలు సర్జరీలు కూడా జరిగాయి. దాంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతుండడంతో తనను కన్న అసలైన తండ్రి నుంచి ఆర్థిక సాయం కోరేందుకు డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలనుకుంటున్నాను అని అసలు విషయం చెప్పాడు. ఆ యువకుడు చెప్పిన కారణాలు విన్న కేరళ హైకోర్టు.. డీఎన్ఏ పరీక్షకు ఒప్పుకుంది. దాంతో ఆ తండ్రి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించుకున్నాడు. దీనిపై వాదోపవాదాలు విన్న సుప్రీంకోర్టు.. ఆ పిటిషన్‌లో కొట్టేసింది. DNA పరీక్ష అనేది అవతలి వ్యక్తి ఒప్పుకుంటేనే చేయాలని.. వాళ్లు ఒప్పుకోకపోతే అది చెల్లదని తీర్పు ఇచ్చింది.