Shiva Lingam at Home కార్తీక మాసం కావడంతో ప్రతి భక్తుడి ఇంటా శివ పూజలు అంబరాన్నంటుతుంటాయి. అయితే చాలా మందికి అసలు శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవాలా వద్దా అనే సందేహం ఉంటుంది. ఒకవేళ తెచ్చుకోవాలనుకున్నా.. చిన్నది మంచిదా పెద్దది మంచిదా అనే ఆలోచనలో పడుతుంటారు. శివలింగాన్ని ఇంటికి తెచ్చుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కాకపోతే ఆ శివలింగం సైజు రెండు అంగుళాలకు మించకూడదు.
ఇక వెండి, బంగారం, ఇత్తడి ఇలా ఏ లోహంతో చేసిన లింగాన్నైనా తెచ్చుకోవచ్చు. కాకపోతే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వంటివి పెట్టకండి.
శివలింగం పానబట్టాన్ని ఉత్తరం వైపు ఉంచాలి. అంటే మీకు ఉత్తరం వైపు కాదు లింగానికి ఉత్తరం వైపు. ఎందుకంటే ఉత్తరం మన దేశానికి శివ స్థానం లాంటింది.
ఇక స్త్రీలు శివ పూజ చేసుకోవచ్చా అంటే హాయిగా చేసుకోవచ్చు.
మాంసాహారులు కూడా శివ పూజ చేసుకోవచ్చు కానీ శివుడిని పూజించే సమయంలో మాత్రం మాంసం తినకుండా ఉంటే సరిపోతుంది.
ఇక లింగాన్ని ఇంటికి తెచ్చుకోవడానికి ముందు ఏదన్నా శివాలయానికి వెళ్లి అక్కడ పూజారిని రిక్వెస్ట్ చేసి ఆ లింగాన్ని ఆలయంలోని లింగానికి తగిలించి ఇవ్వమని చెప్పండి. అప్పుడు మీరు తెచ్చుకున్న లింగం యాక్టివేట్ అవుతుంది.