Shreyas Iyer ICC T20 ప్రపంచకప్ ఇంకొన్ని రోజుల్లో ప్రారంభం కానుందనగా టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. కీలక ఆటగాడైన తిలక్ వర్మకు టెస్టిక్యులర్ టార్షన్ కావడంతో ఆయనకు సర్జరీ అయ్యింది. దాంతో తిలక్ ఆడలేడు. మరి తిలక్ స్థానంలో ఎవరు వస్తారు? చూపులన్నీ శ్రేయస్ అయ్యర్ వైపే ఉన్నాయి. ఎందుకంటే తిలక్ టాప్ 3 టాప్ 4 ఆర్డర్‌లో ఆడాల్సి ఉంటుంది. 7 నుంచి 15 మిడిల్ ఓవర్స్‌లో తిలక పాత్ర కీలకమైంది. అలా చూసుకుంటే అయ్యర్ కూడా అంతే.
ALSO READ Testicular Torsion అంటే ఏంటి? తిలక్ వర్మకు ఏమైంది?
అయ్యర్ టాప్ 3 టాప్ 4 ఆర్డర్‌లోనే ఆడతాడు. అయ్యర్‌ను తీసుకుంటే టీమిండియాకు బ్యాటింగ్ ఆర్డర్ మార్చాల్సిన అవసరం ఉండదు. మిడిలోవర్ స్పెషలిస్ట్‌గా అయ్యర్ స్పిన్ ఎదుర్కోవడంలో దిట్ట. అయ్యర్ కాకపోతే మరో ఓపెనర్‌ని తీసుకోవాల్సిన పరిస్థితి. నిజానికి మరో ఓపెనర్ అవసరం లేదు. ఎందుకంటే మరో ఓపెనర్‌ను తీసుకుంటే భారీగా మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మంచి పొజిషన్‌లో ఉండే ప్లేయర్‌ను తప్పించాల్సి ఉంటుంది. అదే అయ్యర్‌ను తీసుకుంటే ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు.
గిల్ వద్దు.. ఎందుకంటే?
శుభ్‌మన్ గిల్ ఇక్కడ ఫిట్ అవ్వడని అనిపిస్తోంది. మనకు కావాల్సంది మిడిలార్డర్ బ్యాట్స్‌మన్. ఓపెనర్ కాదు. T20 వరల్డ్ కప్ టీం ఎంపికలో కూడా గిల్ లేడు.





