Shani Effect on Aries: మార్చి 30న శని భగవానుడు మీన రాశిలో సంచరించడం వలన మేష రాశి నుంచి మీన రాశి వరకు శని సంచారం వల్ల కలిగే ఏలినాలి శన ప్రభావాలు అష్టమ శనిగ్రహ ప్రభావం అర్థాష్టమ శని ప్రభావాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాం. మనకి 2025లో మార్చి 30వ తేదీ చాలా విశేష ప్రదమైనది. ఎందుకంటే ఇదే రోజున మనకి ఉగాది, అర్థరాత్రి ఆరు గ్రహాలు మీన రాశిలో సంచరిస్తూ.. షష్ట గ్రహ కూటమి ఆ తర్వాత పంచ గ్రహ కూటమిగా మానవుల మీద దేశం మీద ప్రపంచం మీద ప్రకృతితో అనుసంధానం చెందిన గ్రహాల వీక్షణలు ప్రకృతిపై తన ప్రకోపాలను చూపిస్తూ వైవిధ్యకరమైన ఎన్నో రకాల ఫలితాలను మనపై చూపించబోయే సమయం చాలా త్వరగా ఆసన్నమైంది.
అందులోనూ ముఖ్యంగా మనం కర్మకి కారకుడైన శని భగవానుడు ఇందులో చాలా పెద్ద హీరో పాత్ర వహించనున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా ఒక ఆరు సంవత్సరా నుంచి కూడా తన స్వక్షేత్రాలైన మకర, కుంభ రాశిలో ఎన్నో విధాలైన నక్షత్రాలతో అనుసంధానమై తన స్వక్షేత్రం మూల త్రికోణం అయిన సొంత ఇళ్లల్లో ప్రయాణిస్తూ ఎంతో మంది ఎన్నో రకాలుగా కాపాడుతూ.. ఎవరైతే పూర్వ జన్మ కర్మలను అనుభవిస్తారో ఆ కర్మను అనుభవింపజేస్తూ ఆ శనీశ్చరుడు తన మంచితనాన్ని, ఇబ్బందులను కూడా కలగజేసాడు. గ్రహాల వీక్షణలన్నీ కూడా చంద్రుడిపై ప్రేరితమై ఆ చంద్రుడే మనసులా రూపాంతరం చెంది ఉంటాడు కాబట్టి మనో నిగ్రహం ఉండాలి. (Shani Effect on Aries)
శని మహానుభావుడు మీన రాశిలో పూర్వాభాద్రా నక్షత్రం, నాలుగో పాదంలో మార్చి 30 నుంచి తన ప్రభావాన్ని చూపుతూ ఏప్రిల్ 7 వరకు అదే నక్షత్రంలో ఉంటాడు. ఆ తర్వాత శని భగవానుడు జులై 13న తన సొంత నక్షత్రం అయిన ఉత్తరాభాద్రా నక్షత్రంలో ప్రవేశించి ఆ తదుపరి అక్టోబర్ 5న మీన రాశిలోనే పూర్వాభాద్రా నక్షత్రంలో వక్రగతిని పొందుతారు. మొత్తం మీద మీన రాశిలో ఉండటమే మన కర్మలన్నీ నివృత్తి చేసే పరిస్థితి కలిగిస్తున్నాడు అని అర్థం. పూర్వ జన్మల్లో మిగిలిన పుణ్యాన్ని ఈ జన్మలో మనం దేవతా ప్రతిష్ఠల ద్వారా జల రాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి నదులు, బావులు వంటి తవ్వడం ద్వారా కానీ నదులను సంరక్షించడం ద్వారా శని భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. శని భగవానుడు మీన రాశిలో పూర్వాభాద్ర, ఉత్తరాభాద్రా, ఆ తర్వాత రేవతి నక్షత్రాల్లో పరిభ్రమించడం వల్ల రకరకాల దివ్యకరమైన శుభాలు అశుభాలు కలిగే పరిస్థితులు ఉంటాయి. శని భగవానుడు మార్చి 30న మీన రాశిలో ప్రభావితం అవ్వడం ద్వారా ఏ రాశుల వారికి ఏ రకమైన ప్రభావాన్ని సూచిస్తాయి అనేది తెలుసుకుందాం.
శని భగవానుడు మీన రాశిలో సంచారం వల్ల మేష రాశి వారికి మార్చి 30వ తేదీ నుంచి ఎన్నో విధాలైన లాభాలు పొందారు. వారిలో ముఖ్యంగా రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, గనుల వ్యాపారం చేసే వారు, మిత్రుల వల్ల లాభపడిన వారు, ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వచ్చిన వాళ్లు ఉన్నారు. మార్చి 30 నుంచి మేష వారికి కొన్ని అవరోధాలైతే తప్పవు. అలాగని అధైర్యపడకండి. శని భగవానుడు కష్టం ఇస్తున్నాడంటే అది అనుభవించేస్తే ఆ తర్వాత మంచి చేస్తున్నారని అర్థం. మేష రాశి వారికి ఏలినాటి శని ప్రభావితం జరుగుతుంది. ఆ ప్రభావంలో మంచి ఉంది. ఈ ఏలినాటి శని చివరి దశలో ఉంది కాబట్టి ఇతర కర్మలన్నీ కాస్త త్వరగా అనుభవించేలా ఆ శని భగవానుడు చేస్తాడట. (Shani Effect on Aries)