Shani Dev Mantra: శని నా నెత్తి మీదే ఉన్నాడు రా.. ఏ పని జరగడంలేదు. అనుకున్నది నెరవేరడం లేదు. ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్లు మన మధ్యే ఉంటారు. మనం కూడా అనుకుంటూ ఉంటాం. కానీ శని దేవుడు కర్మకారకుడు. ఒక రకంగా చెప్పాలంటే న్యాయమూర్తి. మనం చేసే కర్మలను బట్టి ఫలితం ఇస్తాడే తప్ప.. ఆయనకు మనపై వ్యక్తిగత కక్ష ఉండదు. ఆయన అనుగ్రహం ఉంటే మనం ఏ రేంజ్‌లో ఉంటామో ఊహించలేం. అదే ఆయన అనుగ్రహం లేకపోతే కుక్కలు చింపిన విస్తరి అవుతుంది జీవితం. అందుకే శని భగవానుడిని ఎప్పుడూ ఈ శని ఎప్పుడు వదులుతుందో.. ఈ శనిగాడు వచ్చాడు అని అస్సలు అనకూడదు. ఒకవేళ మీరు ఏ పని చేయాలనుకున్నా ఏదో ఒక కారణం చేత ఆగిపోవడం.. అసలు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటూ పనులకు ఇబ్బంది కలుగుతుంటే శని నడుస్తోందని అనుకోవాలి. అప్పుడేం చేయాలి? శని భగవానుడి అనుగ్రహం ఎలా పొందాలి? ఈ విషయాలను తెలుసుకుందాం.
గుడ్ లక్ కోసం
ప్రతి శనివారం సాయంత్రం.. రావిచెట్టు ఉన్న ఆలయానికి వెళ్లండి. రావి చెట్టు దగ్గర గుప్పెడు మినుములు, కొద్దిగా పెరుగు, దానిపై కాస్త పసుపు వేసి ఉంచండి. ఆ తర్వాత దండం పెట్టుకుని మళ్లీ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోండి. మీరు పొరపాటున వెనక్కి తిరిగి చూస్తే మిమ్మల్ని వెంటాడుతున్న బ్యాడ్ లక్క మళ్లీ మీకే తగులుతుంది. ఇలా 21 శనివారాలు చేసి చూడండి. మార్పు మీకే తెలుస్తుంది. ఈ పరిహారం వల్ల ఆర్థిక సమస్యలు కూడా దూరమైపోతాయని చెప్తుంటారు. (Shani Dev Mantra)
శని దోషం ఉంటే
ఒకవేళ మీ జాతకంలో శని దోషం ఉందనుకోండి. ఇలా చేసి చూడండి. శనివారం రోజున కొన్ని మినుములు తీసుకుని మీ తల చుట్టూ మూడు సార్లు తిప్పండి. ఆ తర్వాత ఆ మినుములను కాకులకు పెట్టండి. ఇలా 7 శనివారాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కుదిరితే మినుములు పేదవారికి కానీ బ్రాహ్మణులకు కానీ దానంగా ఇవ్వచ్చు. మీరు దానం ఇచ్చేటప్పుడు కేవలం ఆ వస్తువు మాత్రమే కాకుండా కొంత డబ్బు కూడా ఇవ్వండి. లేదంటే వారు మనస్ఫూర్తిగా తీసుకోలేరు.
ఆర్థిక సమస్యలు పోవాలంటే
విపరీతమైన ఆర్థిక సమస్యలు.. ఇంకొన్ని రోజులు ఉంటే రోడ్డు మీదకు వచ్చే పరిస్థితులు ఉంటే ఇలా చేసి చూడండి. శనివారం రోజున మీరు నిద్రపోయే ముందు చిన్న గిన్నెలో ఆవ నూనె వేసి మంచం కింద పెట్టి పడుకోండి. ఆ మరుసటి రోజున మినములతో ఏదన్నా ప్రసాదంగా చేసి ఈ ఆవనూనెలో కలిపి కుక్కలకు కానీ లేదా పేదలకు కానీ పెట్టండి. కుక్కలకే కదా అని నాసిరకం వాటిని వాడకండి. కుక్క అంటే కాలభైరవుడు. కుక్కలకు, ఆవులకు కడుపు నిండా అన్నం పెట్టిన వాడి అందరి దేవుళ్ల ఆశీర్వాదం ఉంటుందని అంటారు. ఈ పరిహారం మీకు వీలున్నప్పుడల్లా శనివారాల్లో చేస్తూ ఉండండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. (Shani Dev Mantra)
డబ్బుకు లోటు ఉండకూడదంటే
జీవితంలో బాగా డబ్బులు సంపాదించాలి.. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు అనుకుంటే ఇలా చేయండి. శనివారం రోజున మినుములను రుబ్బి రెండు ఉండలుగా చేసి సాయంత్రం సూర్యాస్తమయం అవ్వగానే దానిపై కాస్త పెరుగు, పసుపు వేసి రావి చెట్టు దగ్గర పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోండి. ఇలా 21 శనివారాలు చేసి చూడండి. దీని వల్ల ఆర్థికంగా బాగుండటమే కాదు.. ఉద్యోగం లేక ఇబ్బందిపడుతున్న వారికి ఏదో ఒక ఉద్యోగం కచ్చితంగా వస్తుంది.
ప్రమోషన్స్ రావాలంటే
ఉద్యోగంలో ప్రమోషన్స్ రాకపోయినా.. సరైన జీతం లేకపోయినా ఇలా చేయండి. శనిదేవుడి ముందు కొన్ని మినుములు వేసి ఆయనకు సంబంధించిన మంత్రాలు చదవండి. ఆ తర్వాత ఆ మినుములు తీసుకుని మీ జేబులో పెట్టుకోండి. మీరు ఎక్కడ పనిచేస్తుంటే అక్కడికి ఈ మినుములు మీతో పాటు తీసుకెళ్తే మంచి ఫలితం కనిపిస్తుంది.