Sarath Kumar: తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ నటించిన డూడ్ (Dude) సినిమా పరువు హత్యలకు వ్యతిరేకంగా తీసిన సినిమా అని అన్నారు సీనియర్ నటుడు శరత్ కుమార్. ఈ సినిమాలో శరత్ కుమార్ కీలక పాత్రలో నటించారు. అయితే.. సినిమాలోని ఓ సన్నివేశంలో శరత్ కుమార్ ప్రదీప్ కాలి దగ్గర కూర్చుని ఏడుస్తుంటారు.
ఈ సన్నివేశంపై తమిళ నటి దేవయాని శరత్ కుమార్‌కు ఫోన్ చేసి ప్రదీప్ కాలి దగ్గర మీరు కూర్చుని ఏడవడం ఏంటి అని అడిగిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. నేను ప్రదీప్ కాలి దగ్గర కూర్చోలేదు. సినిమాలో నా చెల్లెలి కొడుకు దగ్గర కూర్చుని ఏడ్చాను. అదొక క్యారెక్టర్ మాత్రమే. అయితే ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకుంటూ పైకి వస్తున్న నటుడి పక్కన కూర్చుని ఏడ్చే సన్నివేశంలో నటిస్తే తప్పేముంది అని సమాధానం ఇచ్చినట్లు శరత్ కుమార్ తెలిపారు.





