Saina Nehwal Divorce: ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ దంపతులు ఇటీవల ఓ బాంబు పేల్చారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. పారుపల్లి కశ్యప్ విడాకుల గురించి ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు కానీ.. కాస్త తొందరపడి సైనా తాము విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దాంతో వీరి అభిమానులతో పాటు చాలా మంది ప్రముఖులు కూడా షాక్‌కు గురయ్యారు.
అయితే.. ఈరోజు సైనా ఓ శుభవార్త చెప్పారు. తామిద్దరం విడిపోవాలనుకున్నప్పటికీ కొన్ని రోజుల పాటు దూరంగా ఉండటంతో తాము మరింత దగ్గరయ్యామని.. కాబట్టి విడాకులకు స్వస్తి పలుకుతున్నట్లు తెలిపారు. మరోసారి తమ బంధానికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుపుతూ ఓ చక్కటి ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. వీరి నిర్ణయం పట్ల సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ.. చాలా సంతోషంగా ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
సెలబ్రిటీలు విడిపోతున్నామని ప్రకటించిన తర్వాత మళ్లీ కలిసిపోవాలనుకుంటున్నాం.. మరోసారి తమ బంధానికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం అనే నిర్ణయం తీసుకోవడం చాలా అరుదు. ఈ మధ్యకాలంలో ఎంతో మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుని షాక్‌కు గురిచేసారు. ఆ జాబితాలో సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ఉంటారని ఎవ్వరూ ఊహించలేదు. అలాంటిది వారు ఇప్పుడు విడాకుల నిర్ణయం విరమించుకున్నామని ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసేసుకోకుండా ఇలా కలిసి కూర్చుని మాట్లాడుకుంటే అన్నీ సర్దుకుంటాయని.. ఇలాగే విడాకులు తీసుకున్న ఇతర సెలబ్రిటీలు కూడా ఆలోచించి ఉంటే ఎన్నో కాపురాలు బాగుండేవని కామెంట్స్ పెడుతున్నారు. టెన్నిస్ క్రీడాకారులైన వీరిద్దరూ 2018 డిసెంబర్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు.