Saif Ali Khan Assets: దొంగ చేతిలో కత్తిపోట్లకు గురై ఈరోజే హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన బాలీవుడ్ నటుడు పైఫ్ అలీ ఖాన్‌కు మరో షాక్ తగిలింది. ఆయన కుటుంబానికి చెందిన ఆస్తి మొత్తం మధ్యప్రదేశ్ ప్రభుత్వం సొంతం చేసుకుంది. ఆ ఆస్తి విలువ ఎంతో తెలుసా? అక్షరాలా రూ.15000 కోట్లు. వివరాల్లోకెళితే.. సైఫ్ అలీ ఖాన్‌ది పటౌడీ అనే రాజకుటుంబం. ఆయన తండ్రి మన్సూర్ అలీ ఖాన్. ఆయన భారత క్రికెటర్‌గా ఒక వెలుగు వెలిగారు.
అయితే.. సైఫ్ అలీ ఖాన్ ముత్తమ్మమ్మ అబీదా సుల్తాన్ భారతదేశం విభజన తర్వాత ఆమె తన ఆస్తులన్నీ భోపాల్‌లోనే వదిలేసి పాకిస్థాన్ వెళ్లిపోయారు. ఇలా ఎవరైతే భారతదేశం విభజన తర్వాత దేశాన్ని వదిలి వేరే దేశానికి వెళ్లిపోతారో వారు వదిలేసి వెళ్లిన ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీ చట్టంలో చేరుస్తారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న రూ.15000 కోట్ల ఆస్తిని అబీదా సుల్తాన్ వదిలేసి భారత పౌరసత్వం వదులుకుని పాకిస్థాన్ వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో 2014లో ఈ ఆస్తులను మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎనిమీ ప్రాపర్టీగా గుర్తించింది. అయితే ఇందుకు సైఫ్ అలీ ఖాన్ ఒప్పుకోలేదు. 2015లో ఈ ఆస్తులన్నీ ప్రభుత్వానికి చెందకూడదని.. వాటిపై తనకు హక్కు ఉందని పేర్కొంటూ స్టే ఇవ్వాలని పిటిషన్ వేసాడు. అప్పట్లో స్టే అయితే వచ్చింది కానీ 2024 డిసెంబర్ 13న భోపాల్ హైకోర్టు స్టే ఎత్తివేసింది. (Saif Ali Khan Assets)
స్టే ఎత్తేసిన 30 రోజుల్లో అపిల్లేట్ ట్రిబ్యూనల్‌లో అప్పీల్ పెట్టుకోవాలని సైఫ్ కుటుంబాన్ని ఆదేశించింది. ఇప్పుడు గడువు దాటిపోయినప్పటికీ సైఫ్ కుటుంబం నుంచి ఏ ఒక్కరూ కూడా అప్పీల్ చేసుకోలేదు. దాంతో ఆ రూ.15000 కోట్ల ఆస్తులన్నీ భోపాల్ ప్రభుత్వానికే చెందుతాయని కోర్టు తీర్పునిచ్చింది. అయితే సైఫ్ ఈ కేసు విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్తారా.. లేక ఉన్న ఆస్తులు చాలు అనుకుని వదిలేసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఈ రూ.15000 కోట్ల ఆస్తులే కాకుండా సైఫ్‌కి రూ.1300 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇక కరీనా ఆస్తులు కూడా కలిపితే రూ.1500 కోట్ల పైనే ఆస్తులు ఉన్నాయి. (Saif Ali Khan Assets)