ROKO: ఆస్ట్రేలియా వేదికగా ఈరోజు జరిగిన మూడో ODI మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాటర్ విరాట్ కోహ్లీలు ఈసారి తమ సత్తా చాటారు. 69 బాల్స్‌లో టీమిండియా 237 పరుగులు తీసి విజయం చేజిక్కించుకుంది. ఒక రకంగా ఈరోజు మ్యాచ్ వింటేజ్ రోకో షో అనే చెప్పాలి. మ్యాచ్ అనంతరం రోహిత్, కోహ్లీ ఆడమ్ గిల్ క్రిస్ట్, రవిశాస్త్రిలతో మాట్లాడారు. ఇద్దరూ ఆస్ట్రేలియాతో ఇదే తమ చివరి సిరీస్ అని చెప్పేసారు.
“” నేను ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ను ఎప్పుడూ ఆనందిస్తాను. 2008 నుంచి నాకు ఆస్ట్రేలియా మ్యాచ్‌లతో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. ఒక సెంచరీ, ఒక విజయంతో ఆస్ట్రేలియా గడ్డపై చివరి మ్యాచ్‌ను ముగించినందుకు సంతోషంగా ఉంది. మేం మళ్లీ ఆస్ట్రేలియా రాకపోవచ్చు. కానీ ఆడినన్ని సంవత్సరాలు హాయిగా ఎంజాయ్ చేస్తూ ఆడాం. మంచి జ్ఞాపకాలు ఉన్నాయి చెడు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. అన్నింటినీ సమానంగా తీసుకుంటాం“” అని రోహిత్ తెలిపాడు. కానీ ఎందుకో కోహ్లీ మాత్రం ఏమీ మాట్లాడలేదు. కోహ్లీ మనసులో మాట కూడా రోహితే చెప్పేసినట్లు అనిపించింది. కోహ్లీ మాత్రం ధన్యవాదాలు ఆస్ట్రేలియా అని చెప్పి వెళ్లిపోయాడు.





