RK Roja: రెడ్ బుక్ పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై తప్పుడు కేసులు పెట్టి ఎలాగైనా జైల్లో పెట్టించాలని చూస్తున్న నారా లోకేష్ పని అయిపోయినట్లే అని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆర్కే రోజా. కోటి సంతకాల సేకరణ ర్యాలీలో భాగంగా రోజా మీడియాతో మాట్లాడారు. జగన్ అన్న అధికారంలోకి వచ్చాక లోకేష్‌ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. జగన్ నుంచి తప్పించుకోవాలంటే లోకేష్ ప్రపంచాన్నే వదిలి వెళ్లిపోవాలని అన్నారు. లోకేష్‌కి ఏమీ తెలీక ఇలాంటి పనులు చేస్తున్నాడంటే ఓ అర్థముంది కానీ.. పక్కనే ఉన్న అడ్డదిడ్డ మంత్రి అచ్చెన్నాయుడు అయినా చెప్పాలి కదా అని ప్రశ్నించారు.
లోకేష్ తనని తాను దేవుడు అనుకుంటున్నాడని.. ఆయనే శాశ్వతంగా అధికారంలో ఉంటాడని కలలు కంటున్నాడని అన్నారు. ఈసారి జగన్ నుంచి లోకేష్‌ను చంద్రబాబు నాయుడు కాపాడతాడు అనుకుంటే పొరపాటేనని.. వడ్డీతో సహా తిరిగిచ్చేస్తామని హెచ్చరించారు. తమ పార్టీ నాయకులు తప్పు చేసి ఉంటే ఎన్ని కేసులు పెట్టినా ఏమీ మాట్లాడకుండా ఉండేవాళ్లమని.. హామీల గురించి ప్రశ్నించినప్పుడు రాజకీయ కక్షతో అరెస్ట్‌లు చేస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు.





