Roja vs Pawan: నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని పెద్దలు ఊరికే అనలేదు. ఈ సామెతను పాటించిన వారికే దాని విలువ తెలుస్తుంది. ఈ సామెత ఎక్కువగా వైఎస్సార్ పార్టీకి చెందిన మాజీ మంత్రి రోజా గురించి మాట్లాడేటప్పుడే వాడుతుంటారు. ఎందుకంటే ఆమె మాట్లాడే మాటలు కూడా ఆ రేంజ్‌లో ఉంటాయి మరి.
ఎవరు కూడా ఎవరిపైనా ఊరికే నోరుపారేసుకోరు. అవతలి వ్యక్తి పరిధి దాటి మాట్లాడుతుంటే ఎవరికి మాత్రం సహనం ఉంటుంది. రోజా ఇలా మాట్లాడుతోందంటే.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అదే రేంజ్‌లో రెచ్చగొడుతున్నారనేగా అర్థం. పవన్ ఇప్పటివరకు ప్రచార కార్యక్రమాల్లో నా కొడకల్లారా.. చెప్పుతో కొడతా అని అనలేదా? మరి దీనికి ఏమని సమాధానం చెప్తారు కూటమి పెద్దలు?
సరే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే.. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా ఒక డైలాగ్ కామన్‌గా వాడుతుంటారు. నేను ఇక్కడే పుట్టాను.. నేను ఇక్కడే చదివాను.. నేను ఇక్కడే పెరిగాను.. ఇలాంటి డైలాగులు తరచూ పవన్ నోటి వెంట వింటూనే ఉంటాం. ఈయనేంట్రా బాబూ ఎక్కడికి వెళ్తే అక్కడే పుట్టాను అంటాడు. కనీసం ఏం మాట్లాడుతున్నారో చూసుకోవాలి కదా.. అని కొందరు జనసైనికులు కూడా బుర్రగోక్కున్నారు. పాపం వారి బాధ ఏంటంటే.. తమ నాయకుడు ఎవరి ముందు నవ్వుల పాలు కాకూడదనే. అంతకుమించి ఏమీ లేదు.
అయితే.. ఈ డైలాగ్ గురించి పవన్ క్లారిటీ ఇచ్చేసారు. హరిహర వీరమల్లు ప్రమోషన్స్ సమయంలో మీడియాతో సంభాషించిన ఆయన తాను ఎందుకు ఎక్కడికి వెళ్తే అక్కడే పుట్టాను అంటారో వివరించారు. తన పేరే పవన్ అని పవనుడు (వాయువు) అంతటా వ్యాపించి ఉంటాడు కాబట్టే ఆ మాట అంటున్నానని అన్నారు. దీనికి రోజా ఎక్స్‌లో కౌంటర్ వేసారు. అపానవాయువు అంతటా ఉంటుంది కానీ ఏమి లాభం? అని ట్వీటారు. అంటే.. ఉపయోగపడని వాయువు ఉన్నా ఎవరికి లాభం అనే ఉద్దేశంతో ఆమె ఈ మాటన్నారు. అంటే పవన్ ఎక్కడున్నా ఆయన ప్రజలకు ఉపయోగపడని పనులు చేయనప్పుడు అంతటా ఉండి ఏం లాభం అనేది ఆమె చేసిన వ్యాఖ్యకు అర్థం.