HCU Issue: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోపంతో కొంప ముంచే నిర్ణయం తీసుకోబోతున్నారా? అవుననే తెలుస్తోంది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను దున్నేసి అక్కడ కంపెనీలు తీసుకొస్తానంటూ రేవంత్ వేసిన ప్లాన్‌కు HCU విద్యార్థులు గట్టిగా బుద్ధి చెప్పారు. సుప్రీంకోర్టు కూడా విద్యార్థులకు అనుకూలంగా స్పందించడంతో రేవంత్‌కు ఒళ్లుమండినట్లుంది. దాంతో ఆ 400 ఎకరాలు నాకు దక్కకుండా చేస్తారా.. మీ యూనివర్సిటీనే ఇక్కడ లేకుండా చేస్తా అన్నట్లు రేవంత్ వ్యవహరిస్తున్నారని టాక్.
HCU విద్యార్థుల మీద రేవంత్ “రాజీవ్ పార్క్” పేరిట రివెంజ్ అస్త్రం ప్రదర్శించబోతున్నారట. HCU యూనివర్సిటీ మరోచోటికి తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. HCU మరియు కంచ గచ్చిబౌలి 1600 ఎకరాల్లో ఎకో పార్క్ ఏర్పాటు చేసి దానికి రాజీవ్ గాంధీ పార్క్‌గా నామకరణం చేస్తే బావుంటుందని తెలంగాణ మంత్రులు రేవంత్ ముందు ప్రతిపాదన ఉంచినట్లు సమాచారం.