Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులది (Chandrababu Naidu) గురు శిష్యుల బంధం అంటుంటారు. కానీ రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక ఇంకోసారి తనను చంద్రబాబు శిష్యుడు అంటే ముడ్డి మీద తంతా అని నేరుగా కామెంట్ చేసేసారు. సీఎం అయ్యాక రేవంత్ తీరు మారిపోయింది. ఈ విషయం పక్కన పెడితే.. సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సందర్భంలో చంద్రబాబు నాయుడు ఈ ఘటన గురించి స్పందిస్తూ.. అలా సినీ నటుడిని బాధ్యుడిని చేస్తూ అరెస్ట్ చేయించడం కరెక్ట్ కాదు అని అన్నారు. దీనిపై తాజాగా రేవంత్ స్పందించారు. ప్రస్తుతం భారతదేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంతా స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న దావోస్ (Davos) సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు.
రేవంత్, చంద్రబాబు నాయుడు కూడా అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అల్లు అర్జున్ ఇష్యూపై చేసిన కామెంట్స్ గురించి రేవంత్ స్పందించారు. అసలు చంద్రబాబు నాయుడుకి అల్లు అర్జున్ విషయంలో ఏం జరిగిందో తెలీదని.. ఆయన ఒక కామెంట్ చేసే ముందు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని అన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో ఓ మహిళ చనిపోతే దాదాపు 11 రోజుల వరకు అల్లు అర్జున్ పట్టించుకోలేదని.. ఈ విషయంలో తన ప్రమేయం ఉంది అనడం కంటే చట్టం తన పని తాను చేసుకుని పోయింది అంటే బాగుంటుందని అన్నారు. (Revanth Reddy)
పుష్ప 2 సక్సెస్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ తెలంగాణ ముఖ్యమంత్రి అంటూ పేరు మర్చిపోవడం… ఆ తర్వాత గొంతు పట్టేసింది నీళ్లు తాగి మళ్లీ మాట్లాడతాను అంటూ ఆ తర్వాత రేవంత్ రెడ్డి పేరును గుర్తు చేసుకుని మాట్లాడటం.. ఇవన్నీ రేవంత్‌ని ఆగ్రహానికి గురిచేసాయని కొందరి టాక్. పుష్ప 2 సినిమాకు బెనిఫిట్ షోలు, టికెట్ హైక్స్ ఇస్తే తన పేరే మర్చిపోతాడా అని రేవంత్ మండిపడ్డారట. అదే సమయంలో పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం.. ఆమె కుమారుడు శ్రీతేజ్ కొన్ని రోజులు పాటు కోమాలో ఉండటం జరిగాయి. ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం.. అదే రోజు రూ.4 కోట్లు ఖర్చు పెట్టి బెయిల్ తెచ్చుకోవడం జరిగాయి. కొన్ని రోజుల క్రితమే అల్లు అర్జున్ హాస్పిటల్‌లో చికిత్సపొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించారు. ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా సాయం చేస్తానని ఆల్రెడీ అల్లు అరవింద్ తెలిపారు.