Ram Gopal Varma మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజాతో తాను ఫోటో తీస్కోలేదని బాధపడుతున్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.
ఆయన ఇలా ఫీలవ్వడానికి కారణం వర్మకు మంచి స్నేహితుడైన దర్శకుడు కృష్ణ వంశీనే. 1989లో బాంబే ల్యాబ్స్‌లో ఇళయరాజా శివ సినిమా కోసం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు కృష్ణవంశీ ఒక్క ఫోటో కావాలి సర్ అని అడిగారట.
అప్పుడు ఆయనతో ఫోటో దిగే అవకాశం వచ్చిందని కృష్ణవంశీ ట్వీట్ చేస్తూ ఫోటోను షేర్ చేసారు. దీనికి వర్మ రిప్లై ఇస్తూ.. తాను కూడా ఓ ఫోటో దిగి ఉంటే బాగుండేది అంటూ తెగ ఫీలవుతున్నారు.






