Rajinikanth సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన సినిమా 37 ఏళ్లుగా రిలీజ్‌కు నోచుకోలేదంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. 1989లో ఆయన నటించని హమ్ మే షహెంషా కౌన్ అనే హిందీ సినిమా కొన్ని కారణాల వల్ల నేటి వరకు రిలీజ్ అవ్వలేదు.
ముందు ఈ సినిమాకు టక్రావ్ అనే టైటిల్ అనుకున్నారు. ఇందులో రజినీకాంత్‌తో పాటు శతృఘ్న సిన్హా, హేమమాలిని, ప్రేమ్ చోప్రా, అనితా రాజ్, అమ్రీష్ పురి నటించారు.
సినీ నిర్మాత రాజా రాయ్ 1989లో వ్యక్తిగత కారణాల వల్ల లండన్ వెళ్లిపోవడంతో సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత రాజా రాయ్ కుమారుడు చనిపోవడం.. ఇతర నటీనటులు డేట్స్ ఇవ్వలేకపోవడంతో నాలుగు దశాబ్దాలుగా సినిమాను ఆపేయాల్సి వచ్చింది.
ఇప్పుడు అన్నీ సెట్ అవ్వడంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వాడి 80ల కాలం నాటి సినిమాలా కాకుండా ఈతరం సినిమాగా దీనిని త్వరలో రిలీజ్ చేయనున్నారు.





