Nara Lokesh ఆంధ్రప్రదేశ్‌కు తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరికైనా అర్హత ఉందంటే అది నారా లోకేష్‌కేనట. ఈ మాట ఎవరో కాదు.. జమ్మలమడుగు ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీనేత ఆదినారాయణ రెడ్డి అన్నారు.
లోకేష్‌కు సీఎం పదవికి ఇస్తే మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారా అని అడిగితే కచ్చితంగా ఒప్పుకుంటారని కూడా ఆయనే చెప్పేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వానికి మరో రెండున్నరేళ్ల గడువు ఉందనగా ఆ రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి స్థానాన్ని నారా లోకేష్ తీసుకుంటారన్న టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది.
అయితే.. ఇందుకు పవన్ ఒప్పుకోరని ఎందుకంటే ఆయనకు చంద్రబాబు నాయుడు పట్ల నమ్మకం ఉంది కానీ తన కంటే చిన్నవాడైన లోకేష్ సీఎం అయితే పరువు పోయినట్లు ఉంటుందన్న వాదనలు కూడా అక్కడక్కడా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ.. లోకేష్‌కు యువ గళం పాదయాత్ర ఎంతో మేలు చేసిందని.. అదీకాకుండా ఐటీ శాఖకు మంత్రిగా చేసిన అనుభవం ఉండడంతో తదుపరి సీఎం కుర్చీ ఎక్కే హక్కు లోకేష్‌కే ఉందని ఇందుకు అందరూ కూడా సహకరిస్తారని తెలిపారు.





