Chiranjeevi – Anil Ravipudi: మెగా స్టార చిరంజీవి.. అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒకప్పుడు బాలీవుడ్‌ని ఒక ఊపు ఊపిన నటిని హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకుంటున్నారట. ఒకప్పుడంటే బొద్దుగా ఉన్నా కూడా తన నటన, అందంతో కుర్రకారును కట్టిపడేసింది. ఆ తర్వాత ఉన్నట్టుండి ఓ ఏడాది కనుమరుగైపోయి.. సన్నబడి మళ్లీ ఎంట్రీ ఇచ్చి అందరినీ షాక్‌కి గురిచేసింది. ఆ తర్వాత తన ఫిట్‌నెస్‌ను మెయింటైన్ చేసుకోలేకపోయిందేమో.. మళ్లీ బొద్దుగా మారిపోయింది.
ఇప్పుడు ఓ ఇంటికి ఇల్లాలు కూడా. పైగా ఆమె భర్త రాజ్యసభ ఎంపీ. ఆమెను చిరు సినిమాలో హీరోయిన్‌గా అనుకుంటున్నారట. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా. ఆప్ నేత రాఘవ్ చద్దాతో గతేడాది పెళ్లి పీటలెక్కిన పరిణీతి చోప్రాను చిరు సినిమాలో హీరోయిన్‌గా అనుకుంటున్నట్లు టాక్స్ నడుస్తున్నాయి. అయితే ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదు. ఉగాది రోజున రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతోంది. పరిణీతి కజిన్ అయిన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతోంది.