Nicolas Maduro వెనెజ్వెలా అధ్యక్షుడు నికోలా మడురో తన జీవితంలో చేసిన పెద్ద తప్పు ఏంటంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని రెచ్చగొట్టడం. అసలే ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని ఎదురుచూస్తున్న ట్రంప్‌ని ఒకప్పుడు నికోలా ఇక్కడే ఉంటా.. దమ్ముంటే వచ్చి పట్టుకో అని ఛాలెంజ్ విసిరాడు. కట్ చేస్తే.. ఇప్పుడు నికోలా ట్రంప్ ఆధీనంలో ఉన్నాడు.
నికోలా అలా ఎందుకు అన్నాడంటే.. గతేడాది ట్రంప్ ఓ ప్రసంగంలో నికోలాకు సంబంధించిన ఎలాంటి సమాచారం అందించినా వారికి పరిహారం ఎక్కువగా ఇస్తాను అని ప్రకటించారు. ఆ ప్రకటన అనంతరం నికోలా స్పందిస్తూ.. నేను ఇక్కడే నా అధ్యక్ష నివాసంలో ఉంటా. దమ్ముంటే వచ్చి పట్టుకో. లేట్ చేయకు పిరికి పంద అని వ్యాఖ్యానించారు. అప్పుడు నికోలా అన్న వ్యాఖ్యలను వైట్ హౌస్ వైరల్ చేస్తూ.. చేసి చూపించాం అని చంకలు గుద్దుకుంటోంది.





