Nara Rohit ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసారు నటుడు నారా రోహిత్.
ఈ నేపథ్యంలో ఆయన ఎక్స్‌లో ఓ ట్వీట్ చేసారు. “” నీ లాంటి రాబందుల నుంచి సంస్కారం ఆశించడంలో అర్థం లేదు. అప్పుడెప్పుడో 1989లో ఒకసారి గెలిచి ఆ తర్వాత 30 ఏళ్లకు 2019లో గెలిచావు.
దీనిని బట్టే నీ చీప్ రాజకీయ చరిత్ర ఎలా ఉందో అర్థమవుతోంది. ఇలాంటి రికార్డుతో గొప్పవారైన చంద్రబాబు నాయుడు గురించి నువ్వు తప్పుగా మాట్లాడటం నీ దిగజారుడుతనాన్ని నిదర్శనం. సమయమే నీ లాంటి వారి చేష్టలకు బుద్ధి చెప్తుంది “” అని ట్వీట్ చేసారు.





