Naga Chaitanya Sobhita నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాలతో కలిసి తొలి దీపావళిని జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఇద్దరూ దీపావళి జరుపుకున్న సందర్భంగా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. పర్పుల్ రంగు డిజైనర్ డ్రెస్‌లో శోభిత షేర్వాణిలో నాగచైతన్య చూడముచ్చటగా ఉన్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే తండేల్ సినిమాతో ఈ ఏడాది మంచి హిట్ అందుకున్నారు నాగచైతన్య. ఇప్పుడు ఆయన NC 24లో నటిస్తున్నారు. కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఓ మైథలాజికల్, యాక్షన్ అడ్వెంచరర్. ఇప్పటికే షూటింగ్ మొదలైంది. ఇక శోభిత లవ్, సితార అనే సినిమాలో నటించారు. 2024లో వచ్చిన ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం ఆమె పా రంజిత్ దర్శకత్వంలో వెట్టువమ్ అనే సినిమాలో నటిస్తున్నారు.