Naga Chaitanya: గతేడాదే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నాగచైతన్య, శోభిత ధూళిపాల తొలి సంక్రాంతి పండుగను నిరాడంబరంగా జరుపుకున్నారు. తెలుగు సంప్రదాయానికి ఎంత విలువిచ్చే శోభిత చక్కగా ఇంటి ముందు ముగ్గులు వేసి.. తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో జరుపుకున్నారు. అయితే.. చైతన్య తన భార్యకు ఓ ముద్దు పేరు పెట్టారు. అదేంటో తెలుసా.. విశాఖ క్వీన్ అంట. అవునండీ.. తన భార్య శోభితతో కలిసి పండుగ చేసుకున్నట్లు నాగచైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బ్యూటిఫుల్ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్‌కి క్యాప్షన్‌గా.. సంక్రాంతి పండుగ విత్ విశాఖ క్వీన్ అని రాసాడు. దాంతో ఆ పోస్ట్ కాస్తా తెగ వైరల్ అవుతోంది. చైలో ఇలాంటి కోణం కూడా ఉందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక సమంత అభిమానుల గురించి తెలిసిందేగా.. వాళ్లు వాళ్లు బాగానే ఉన్నా వీరికి మాత్రం ఇంకా బాధనే ఉందట. సమంతతో పెళ్లైనప్పుడు ఎప్పుడైనా ఇలాంటి ఫోటో పెట్టి అలాంటి క్యాప్షన్ ఇచ్చావేంట్రా అంటూ ఆడిపోసుకుంటున్నారు.






