Manchu Manoj: మంచు మనోజ్ డేవిడ్ రెడ్డి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ ద్వారా ప్రకటిస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేసారు. అయితే.. టైటిల్‌లో రెడ్డి పదం ఉండటంతో సోషల్ మీడియాలో కాస్త హాట్ టాపిక్‌గా మారింది. ఓ నెటిజన్ ఇంకెన్నాళ్లు బ్రో రెడ్డీస్ అనే ట్రెండ్.. డేవిడ్ చౌ అని పెట్టుకో 100 రోజుల పాటు 200 సెంటర్లలో ఆడుతుంది అని సరదాగా కామెంట్ చేసాడు.
దీనికి మంచు మనోజ్ ఇచ్చిన రిప్లై వైరల్ అవుతోంది. చౌ అని పెట్టమని ఆయన కూడా సజెస్ట్ చేసారట. కానీ వినలేదని చెప్పారు. మనోజ్ కులం గురించి కామెంట్ చేయగానే ఇక నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోయారు. కొందరు జోవియల్‌గా తీసుకుని జాగ్రత్త అన్నా వదినకు తెలిస్తే గొడ్డలితో రెడీగా ఉంటది అంటూ సరదాగా కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు ట్రోల్స్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.





