Leo Horoscope: జనవరి 10 నుంచి 17 వరకు స్థితి గతులు మారే రాశులు ఉన్నాయి. స్థల చలన లేకపోయినా శని భగవానుడు నక్షత్ర చలన అవుతున్నాడు. ఆ తర్వాత 13న శుక్రుడు ధనుస్సు నుంచి మకరానికి మారుతున్నాడు. 14న రవి, 15న బుధుడు, 16న కుజుడు, 17 చంద్రుడు మారుతున్నారు.
దీనిని షష్ట గ్రహ కూటమి అంటారు. దీని వల్ల ద్వాదశ రాశులకు శుభఫలితాలు కలగనున్నాయి. సింహ రాశి వారికి వారందరిపై శని భగవానుడి అశుభ దృష్టి ఉంది. వారికి కొంత మేర ఈ జనవరి 10 నుంచి డిసెంబర్ 16 వరకు ఉపశమనం లభించనుంది. ఇళ్లు, స్థలాలు, పొలాల విషయంలో కొనలేని వారు, మోసపోతున్నవారు, డబ్బులిచ్చి మోసపోయిన వారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, ఏ పనీ జరగక సతమతమవుతున్న వారు.. వీరందరికీ ఉపశమనం కలగనుంది.
ఒక్కమాటలో చెప్పాలంటే సింహ రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ధనుస్సు రాశి నుంచి బుధుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో సింహ రాశి వారికి ధనయోగం పట్టనుంది. కాకపోతే ఇక్కడ కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఫిబ్రవరి 19 వరకు పెట్టుబడులు, పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడం, గృహ ప్రవేశాలు వంటివి వద్దు. అంతేకాదు.. జనవరి మాసంలో సింహ రాశిలో పుట్టిన ఆడ, మగపిల్లల జీవితాలు ఎంతో శుభకరంగా ఉంటాయి.





