Lakshmi Parvathi ఓ పక్క పిల్లనిచ్చిన మామగారిపై చెప్పులేయించి.. ఇప్పుడేమో 1700 కోట్ల రూపాయలతో ఆయన విగ్రహం పెడతారంట అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మీ పార్వతి. ఈరోజు దివంగత నేత నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా లక్ష్మీపార్వతి ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ పాలన ఎంత దారుణంగా ఉందో చూస్తుంటే కూటమిపై అసహ్యమేస్తోందని అన్నారు. అసలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లాంటి నీచులతో ఎలా పొత్తు పెట్టుకున్నారు అంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయాలనుకుంటున్నట్లు తెలిపారు. మళ్లీ ఎన్నికల్లో తమ అధినేత జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే తన ప్రతీకార చర్యగా ముందు లోపలేసేది నారా లోకేష్‌నే అని హెచ్చరించారు.





