KTR తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరోసారి అవాక్కులు చవాక్కులు పేల్చారు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR.
మాట్లాడితే తనను KCR అధికారంలో ఉన్నప్పుడు జైల్లో పెట్టించాడని.. దోమల వల్ల చాలా ఇబ్బందిపడ్డానని చెప్తున్నాడని.. ఇలాంటి లుచ్చా డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నప్పుడు పోలీసులు పట్టుకుంటే దానికి తామేం చేస్తామని అన్నారు.
చేసిన లుచ్చా పనికి జైలుకు పోతే అదేదో స్వాతంత్ర్య సమరయోధుడిగా జైలుకి పోయినట్లు రేవంత్ మాట్లాడుతుండడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
రేవంత్ రెడ్డి తండ్రి తన చిన్న కొడుక్కి కొండల్ రెడ్డి అని పేరు పెడితే పెద్ద కొడుక్కి తొండల్ రెడ్డి అని పెట్టుండాల్సిందని అన్నారు.
మాట్లాడితే తొండలు తొండలు అని వాగుతున్నాడని.. తులం బంగారం, మహిళలకు స్కూటీ ఎక్కడ అంటే గుడ్లు పీకి గోలీలు ఆడతా అంటున్నాడని అన్నారు.
రేపో మాపో హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్తున్నాడని.. అక్కడ కూడా అదేదో సినిమాలో చిరంజీవి ఇన్‌ఫ్రండ్ దేర్ ఈజ్ క్రొకొడైల్ ఫెస్టివల్ అన్నట్లు వచ్చీ రాని ఇంగ్లీష్ భాష మాట్లాడి వారి బుర్రలు కూడా చెడగొట్టి వస్తాడేమో అని షాకింగ్ వ్యాఖ్యలు చేసారు.





