అంటే.. పోగొట్టుకున్నది తిరిగి ఇచ్చే శక్తి ఈ మంత్రానికి ఉందన్నమాట. సాధారణంగా మన దగ్గరున్న వస్తువు ఏదైనా పోతే మనం మనకున్న రెండు చేతులతో వెతుకుతూ ఉంటాం. కానీ కార్తవీర్యార్జునుడు మాత్రం తనకున్న వెయ్యి చేతులతో వెతికిపెడతాడట.మరొకటి ఏంటంటే.. కార్తవీర్యార్జునుడు సుదర్శనాంశతో జన్మించాడని దత్తపురాణంలో ఉంది. సూ దర్శనం అంటే బాగా కనిపించేలా చేయడం అని అర్థం. అందుకే ఏదైనా పోతే దానిని దొరికిస్తాడు అని నమ్ముతారు. ఇది ఊరికే జనాలు చెప్పింది కాదు. శాస్త్ర ప్రామాణికమైన శ్లోకం కూడా ఉంది.
కార్తవీర్యార్జునో నామ రాజా బహు సహస్రవాన్
తస్య సంస్మరణాదేవ నృతం నష్టం చ లభ్యతే
కార్తవీర్యార్జునడునే ఆయన్ని స్మరిస్తే గనుక పోయినదేదైనా లభిస్తుందని ఈ శ్లోకం అర్థం. ఈ శ్లోకం ఎక్కడిది అంటే.. ఇది తంత్ర శాస్త్ర గ్రంథంలో ఉంది. పైన చెప్పిన శ్లోకాన్ని సాక్ష్యాత్తు పరమేశ్వరుడే పార్వతి దేవికి చెప్పాడు. అంటే పరమేశ్వరుడే చెప్పాడంటే కచ్చితంగా జరుగుతుంది కదా..! అందుకని ఈ శ్లోకాన్ని మీ పూజా శ్లోకాల్లో కలుపుకుని కుదిరినన్ని సార్లు అలా చేసుకోండి. పోయిన వస్తువులు ఒక్కొక్కటీ మీ దగ్గరికి ఏదో ఒక రూపంలో తిరిగి వస్తాయి. ఈ శ్లోకం ఎంత శక్తివంతమైనదంటే.. గుళ్లల్లో దొంగలు పడకుండా.. వస్తువులు, విగ్రహాలు, నగలు దొంగతనాలు కాకుండా ఉండాలన్నా కూడా ఆ గుడిలో అర్చకులు ఈ శ్లోకాన్ని రోజూ పూజలో భాగంగా చదివితే కార్తవీర్యార్జునుడే ఆ గుడిని కాపాడతాడు.