Karkataka Rasi Horoscope: శనిగ్రహం రెండున్నర సంవత్సరాల తర్వాత కుంభ రాశి నుంచి మీన రాశిలోకి వస్తుండడం వల్ల వివిధ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. సహజంగా శని అంటే కర్మకు, వైరాగ్యానికి, క్రమశిక్షణకు కారకుడు. ఇలాంటి శని జాతకంలో బలంగా ఉంటే మంచి శుభ ఫలితాలు ఇస్తాడు. అదే విధంగా శని బలహీనంగా ఉంటే ఏం చేసినా ఎలాంటి ఫలితం దక్కకపోవడం వైరాగ్యాన్ని కలిగిస్తాడు. ఈ శని చుట్టూ 29 మార్చి 2025న రాత్రి 10 గంటల తర్వాత కుంభ రాశిని వదిలి మీన రాశిలో స్థితి పొందబోతున్నాడు. శని సహజంగా ఏ భావాలకు కారకత్వం వహిస్తాడంటే.. 6, 8, 12 భావాలకు అధిపతి. 6వ స్థానం అంటే కష్ట నష్టాలు, మృత్యువు, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. 12వ స్థానం అంటే పడక సుఖాలు, నష్టం, కష్టం, వృథా ఖర్చులు ఉంటాయి. శని పడమర దిక్కుకు కారకత్వం వహిస్తాడు, నలుపు రంగును సూచిస్తాడు.
తూర్పున రవి ఉదయించి.. అస్తమించేది పడమర వైపు కాబట్టి.. ఆయన చీకటికి కూడా కారకుడు అని చెప్తారు. ఈ శని విషయంలో శని మకర, కుంభానికి అధిపతి. ఏ రాశుల వారికి అష్టమ శని, అర్థాష్టమ శని, ఏలినాటి శని వర్తిస్తుంది.. ఎవరికి క్లియర్ అయ్యిందని చెప్పాలంటే.. ఈ ఏలినాటి శని మకర రాశి వారికి మార్చి 29తో క్లియర్ అవుతుంది. ఎవరికి మొదలవుతుంది అంటే.. 29 తర్వాత మేష రాశి, అష్టమ శని విషయంలో కర్కాటక రాశి వారికి అయిపోతుంది. సింహ రాశి వారికి మొదలవుతుంది. అర్ధాష్టమ శని వృశ్చిక రాశి వారికి ముగుస్తుంది. ధనస్సు రాశి వారికి మొదలవుతుంది. మరి కర్కాటక రాశి వారికి శని గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. కర్కాటక రాశికి అధిపతి చంద్ర గ్రహం. ఈ రాశిలో పునర్వసు నాలుగో పాదం.. పుష్యమి నాలుగు పాదాలు.. ఆశ్లేషం నాలుగు పాదాలు.. మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. కాబట్టి వీరికి శని కుంభం నుంచి మీనానికి వెళ్లడం వల్ల ఎలా ఉండబోతోందో చూద్దాం.
Karkataka Rasi Horoscope శనీశ్వరుడు కర్కాటక రాశి వారికి ఏడు, ఎనిమిదో స్థానికి అధిపతి అయ్యున్నాడు. ఆయన అష్టమ స్థానాన్ని వదిలి తొమ్మిదికి వెళ్తున్నాడు. మార్చి 29 రాత్రి 10 గంటల తర్వాత రాశి మారబోతున్నాడు కాబట్టి అష్టమ శని అయిపోతుంది. ఇంత కాలం మీరు పడిన మానసిక క్షోభ, శారీరక శ్రమ.. మానసిక బాధలు ఇవన్నీ తొలగబోతున్నాయి. ఇది శుభవార్త అని చెప్పచ్చు. అసలే చంద్రుడు అధిపతి. మైండ్ వేగంగా ఆలోచిస్తుంది. కాబట్టి అన్నీ శుభాలే జరుగుతాయి.